Share News

Mumbai Delivery Agent Harassed: మరాఠీ మాట్లాడితేనే డబ్బులిస్తా.. డెలివరీ ఏజెంట్‌కు షాక్

ABN , Publish Date - May 13 , 2025 | 10:52 PM

మరాఠీలో మాట్లాడితేనే పిజ్జాకు డబ్బులు ఇస్తానంటూ డెలివరీ ఏజెంట్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ముంబై మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Mumbai Delivery Agent Harassed: మరాఠీ మాట్లాడితేనే డబ్బులిస్తా.. డెలివరీ ఏజెంట్‌కు షాక్
Mumbai language dispute

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరివ్వడం నేటు పరిపాటిగా మారింది. ఇలాంటి సందర్భాల్లో తప్పులేమైనా జరిగితే డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. క్యాష్ ఆన్ డెలివరీ అయితే డబ్బులు ఇవ్వమని స్పష్టం చేస్తాం. కానీ భాషపై దురభిమానంతో ఓ మహిళ తనకు పిజ్జా ఇచ్చేందుకు వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. డెలివరీ బాయ్ డబ్బులు అడగగానే సదరు మహిళ మాట ఎత్తింది. మరాఠీలో మాట్లాడితేనే డబ్బులు ఇస్తానని స్పష్టం చేసింది. ‘‘మరాఠీలో మాట్లాడలని బలవంతం చేస్తే ఎలా’’ అని డెలివరీ ఏజెంట్ ప్రశ్నించాడు. ‘ఇక్కడ ఇలాగే ఉంటుంది’’ అంటూ మహిళ మొండిగా జవాబిచ్చింది. అలా అని ఎవరన్నారని డెలివరీ ఏజెంట్ ఎదురు ప్రశ్నించాడు ‘‘అలాంటి కండీన్ ఉండి ఉంటే ఆర్డర్ పెట్టకుండా ఉండాల్సింది. అప్పుడు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు’’ అని అన్నాడు. ఇదేమి బలవంతమని ప్రశ్నించాడు.


ఆ తరువాత మహిళ చెబుతున్న విషయాలను వీడియోలో రికార్డు చేసే ప్రయత్నం చేశాడు. ఫుడ్ బాలేకపోతే చెప్పు.. అంతేకానీ ఇలాంటిది సబబు కాదని పేర్కొన్నారు. ఈలోపు మహిళ పక్కనున్న వ్యక్తి తలుపు వేసేశాడు. చివరకు ఆ డెలివరీ ఏజెంట్ డబ్బులు తీసుకోకుండానే వెళ్లిపోయాడు. అయితే, ఈ ఘటనపై డెలివరీ కంపెనీ మాత్రం ఇంకా స్పందించలేదు.

ఇక ఈ ఘటనపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది మహిళపై విమర్శలు గుప్పించారు. బడుగు జీవి మీ నీ ప్రతాపం ఏమిటని ప్రశ్నించేవారు. తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని బెదిరించి సంతోషం పొందే శాడిజం కొందరికి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఇవి కూడా చదవండి:

కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

Read Latest and Viral News

Updated Date - May 13 , 2025 | 10:53 PM