Share News

Kerala: అద్భుతమంటే ఇదే.. లారీ కింద పడినా..

ABN , Publish Date - May 16 , 2025 | 06:13 PM

Kerala Viral Accident Video: కేరళలో ఓ మహిళ భయానకమైన యాక్సిండెంట్ నుంచి తృటిలో తప్పించుకుంది. లారీ కింద పడినా చాకచక్యంగా ఆమె బయటపడిన దృశ్యాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. ఈ యాక్సిడెంట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Kerala: అద్భుతమంటే ఇదే.. లారీ కింద పడినా..
Kerala Woman Escapes Truck Accident

Kerala Miracle Truck Accident: డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు. కొన్ని సార్లు మన ప్రమేయం లేకున్నా ప్రమాదం ముంచుకొస్తుంది. అలాంటి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. కేరళలో జరిగిన ఈ ప్రమాదమే అందుకు నిదర్శనం. స్కూటీని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నా ఓ మహిళకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ముందు వెళ్తున్న లారీ హఠాత్తుగా వెనక ఉన్న ఆమె పైకి దూసుకొచ్చింది. అలాంటి పరిస్థితిలోనూ సమయస్ఫూర్తితో ప్రాణాలను కాపాడుకుంది. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదృష్టమంటే ఈమెదే.. చావు అంచుల వరకూ కొద్దిలో తప్పించుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


లారీ కింద పడినా..

కేరళలోని కోజికోడ్‌లో ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. ఏటవాలుగా ఉన్న రోడ్డుపై ఇటుకల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి వెనక్కి దొర్లింది. ట్రక్కు వెనక స్కూటీ నడుపుతున్న అశ్వతి పైకి అకస్మాత్తుగా దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో లారీ కింద నుంచి పక్కకు దూకి తృటిలో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రమాదంలో లారీ స్కూటీని నుజ్జు నుజ్జు చేస్తూ వెనక ఉన్న చెట్టుకు గుద్దుకోగా, మహిళ చేతికి స్వల్ప గాయమైంది.


ఈ భయానకమైన యాక్సిండెంట్ దృశ్యాలు చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాబోయే విపత్తును ముందే గుర్తించి వేగంగా అలర్ట్ అయి చాకచక్యంగా తప్పించుకున్న అశ్వతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. CCTVలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీడియో చూసిన వారంతా ఇదొక అద్భుతమని.. మరణాన్ని టచ్ చేసి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.


Read Also: Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..

Viral News: గుండెలు పిండేసే స్టోరీ.. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో..

Monkey Attack Video: వామ్మో.. కుక్కల్లా మారిన కోతులు.. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ..

Updated Date - May 16 , 2025 | 06:44 PM