Viral Video: స్వీట్ షాప్ వద్ద మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి..బుద్ధి చెప్పిన ప్రజలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:49 PM
జనాలు రద్దీగా ఉండే స్వీట్ షాప్ వద్ద ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే పట్టుకుని చితక్కొట్టి, పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) నగరంలోని ఓ స్వీట్ షాప్ వద్ద జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దుకాణం జనంతో కిటకిటలాడుతున్న వేళ, అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా స్పందించింది.
వెంటనే పక్కన ఉన్నవారికి విషయం చెప్పి ఆ వ్యక్తికి క్షణాల్లోనే చుక్కలు చూపించింది. ఈ ఘటనలో స్థానికులు ఏకమై అతన్ని పట్టుకుని చితకబాది, తర్వాత పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి ఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మరికొంత మంది కోరుతున్నారు. మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించిన వారికి కఠిన శిక్షలు వేయాలని మరికొంత మంది కోరుతున్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడం వల్లనే అనేక మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా, పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పని స్థానికులు అంటుండగా, దుకాణ యజమాని అక్కడి భద్రతా చర్యలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాల్లో వారి స్వేచ్ఛపై మరోసారి చర్చను రేకెత్తించింది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి