Share News

Mahakumbh 2025: 9 ఏళ్లుగా తలపై పావురాన్ని మోస్తున్న బాబా.. ఎందుకిలా చేస్తున్నాడంటే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:34 PM

Kabootarwale Baba: అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాలో ఓ బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కబూతర్‌వాలే బాబాగా పిలుస్తున్న ఈ సాధువు.. 9 ఏళ్లుగా తన తల మీద ఓ పావురాన్ని మోస్తుండటం గమనార్హం. అయితే అతడు ఇలా చేయడం వెనుక ఓ సాలిడ్ రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Mahakumbh 2025: 9 ఏళ్లుగా తలపై పావురాన్ని మోస్తున్న బాబా.. ఎందుకిలా చేస్తున్నాడంటే..
Mahakumbh 2025

కుంభమేళా.. ఈ పేరు వినగానే కోట్లాది మంది భక్తులు ఒకేచోట కలిసే సన్నివేశాలే గుర్తుకొస్తాయి. పవిత్ర స్నానాల కోసం దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌తో పాటు నాసిక్, హరిద్వార్, ఉజ్జయినికి విచ్చేస్తారు. అదే సమయంలో కుంభమేళా అనగానే నాగసాధువులు, సన్యాసులు, సంత్‌లూ గుర్తుకొస్తారు. ఈసారి కూడా మేళాలో నాగసాధువులు, బాబాలు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల మీద వస్తూ పలు ఆయుధాలతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ బాబా తన తల మీద ఒక పావురంతో కనిపించారు. మరి.. ఎవరీ బాబా? నెత్తిపై పావురాన్ని ఆయన ఎందుకు మోస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆ కారణం వల్లే..!

మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో కబూతర్ వాలే బాబా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తల మీద పావురాన్ని మోస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. దాదాపుగా 9 ఏళ్లుగా ఆయన తన తలపై ఈ పావురాన్ని మోస్తున్నారు. దీంతో ఆయన ఎందుకిలా చేస్తున్నారు? అసలు పావురాన్ని నెత్తి మీద మోయడానికి గల కారణం ఏంటి? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వయంగా కబూతర్ వాలే బాబా స్పందించారు. జీవులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పావురాన్ని మోస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.


అసలు పేరు ఇదే..!

భూమ్మీద ఉన్న ప్రతి జీవిలోనూ శివుడు ఉంటాడని.. జీవులకు సేవ చేయడంలో భాగంగా ఇలా చేస్తున్నానని కబూతర్ వాలే బాబా అన్నాడు. ఈ ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రేమించాలని ఆయన సూచించాడు. బాగా పాపులర్ అయిన జునా అఖాడాకు హెడ్‌గా ఉన్న ఈ పావురం బాబా అసలు పేరు రాజ్‌పురి మహారాజ్. జంతువులను ఎంతో ఇష్టపడే ఈయన.. హరి పురి అనే పావురాన్ని చాన్నాళ్లుగా పెంచుతున్నాడు. అది ఆ బాబా జీవితంతో పాటు శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఆయన తిన్నా, నిద్రపోయినా, ధ్యానంలో మునిగిపోయినా ఆ పావురం బాబాతోనే ఉండటం విశేషం. దయ, కరుణ, శాంతి, సామరస్యానికి పావురం చిహ్నమని చెప్పిన బాబా.. ప్రపంచంలోని జంతుజాలం విషయంలో అందరూ సహృద్భావంతో ఉండాలని సూచించాడు.


ఇవీ చదవండి:

నాగసాధువుగా మారడం ఎలా.. ఎంత కాలం పడుతుంది..

అన్ని భారతీయ నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ గురించి తెలుసా?

కొండపైకి ఎక్కతుండగా జారిపోయిన మహిళ.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 18 , 2025 | 01:55 PM