Share News

Seattle Manhole covers: మేడ్ ఇన్ ఇండియా మ్యాన్‌హోల్ కవర్లు.. అమెరికన్లకు షాక్

ABN , Publish Date - May 26 , 2025 | 10:24 AM

అమెరికా నగరాల్లో మేడ్ ఇన్ ఇండియా మ్యాన్‌హోల్ కవర్ల దిగమతులపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Seattle Manhole covers: మేడ్ ఇన్ ఇండియా  మ్యాన్‌హోల్ కవర్లు.. అమెరికన్లకు షాక్
Made-in-India manhole

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సియాటెల్ నగరంలో మేడ్ ఇన్ ఇండియా మ్యాన్‌హోల్ కవర్లు కనిపించడం అక్కడి జనాలను షాక్‌కు గురి చేస్తోంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది. మ్యాన్‌హోల్ కవర్లు కూడా ఇండియా నుంచే తెప్పించుకోవాలా అంటూ సదరు నెటిజన్ ఈ పోస్టు పెట్టారు.

స్టీఫెన్ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. ‘‘సియాటెల్ నగరంలోని మ్యాన్‌హోల్ కవర్లు ఇండియా నుంచి తెప్పించుకోవడం ఏమిటీ’’ అని ఆయన ప్రశ్నించారు.

దీనిపై జనాల నుంచి ముఖ్యంగా అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘‘ మ్యాన్‌హోల్ కవర్ల తయారీదార్లు ఇద్దరు వాషింగ్టన్‌లో ఉన్నారు. వారి నుంచి తెప్పించుకుని ఉంటే సరిపోయేదిగా’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించారు.


‘‘సియాటెల్ కాదు.. దేశం అంతటా ఇదే జరుగుతున్నట్టు ఉంది’’ అని మరో వ్యక్తి స్పందించారు. ‘‘ఈ ఇనుప వస్తువుల ఫోర్జింగ్, కాస్టింగ్ అంతా ఇప్పుడు ఇండియాలోనే జరుగుతోంది. అమెరికన్లు సిగ్గు పడాల్సిన అంశం ఇది’ అని మరో వ్యక్తి చెప్పారు.

భారత్‌ అమెరికా కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. కాబట్టి భారత్‌ నుంచి దిగుమతులు అంతిమంగా అమెరికన్లకే ప్రయోజనమని అన్నారు. ఇలాంటి విషయాలు ఇతర దేశాలకు బదిలీ చేసి అమెరికన్ సంస్థలు అత్యాధునిక యంత్రాలు, ఆయుధాల అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం చిక్కిందని అభిప్రాయపడ్డారు. కొందరు పర్యావరణ కారణాలు కూడా దీనికి ఓ కారణమని చెప్పుకొచ్చారు.


కాగా, భారత్‌లో తయారైన మ్యాన్‌హోల్ కవర్స్‌ను దశాబ్దాలుగా అమెరికా వినియోగిస్తోందని కొన్నేళ్ల క్రితమే న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో తయారయ్యే వాటికంటే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వాటి ధర 20 నుంచీ 60 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. కొన్ని అమెరికా నగరాల్లోని చట్టాల ప్రకారం, అక్కడి మున్సిపాలిటీల్లో అత్యంత తక్కువ ధరకు మాత్రమే మ్యాన్‌హోల్ కవర్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకునేందుకు ఈ చట్టాలు అనుమతిస్తాయి.

ఇవి కూడా చదవండి:

ఏటా రూ.7 లక్షలిచ్చి గూగుల్ ఉద్యోగుల్లా పనిచేయమంటే ఎలా.. నెట్టింట టెకీ ఆవేదన

తప్పుడు అడ్రస్ ఇచ్చినందుకు కస్టమర్‌‌పై దాడి... డెలివరీ ఏజెంట్ దారుణం

Read Latest and Viral News

Updated Date - May 26 , 2025 | 10:29 AM