Zepto Delivery Agent: తప్పుడు అడ్రస్ ఇచ్చినందుకు కస్టమర్‌పై దాడి... డెలివరీ ఏజెంట్ దారుణం
ABN , Publish Date - May 25 , 2025 | 09:03 AM
తప్పుడు అడ్రస్ పెట్టినందుకు కస్టమర్‌పై జెెప్టో డెలివరీ ఏజెంట్ దాడి చేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జెప్టో డెలివరీ ఏజెంట్ ఓ కస్టమర్‌పై చేయి చేసుకున్నాడు. బసవేశ్వరనగర్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, విష్ణువర్ధన్ అనే డెలివరీ ఏజెంట్ పచారీ సామాన్లు డెలివరీ చేసేందుకు శశాంక్ అనే కస్టమర్ ఇంటికి వెళ్లాడు. శశాంక్ బంధువు వస్తువులు తీసుకునేందుకు వచ్చింది. ఆ సమయంలో డెలివరీ ఏజెంట్ ఆమెతో గొడవకు దిగారు. తప్పుడు అడ్రస్ ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొడవ పెద్దది కావడంతో శశాంక్ జోక్యం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన విష్ణువర్ధన్.. శశాంక్‌పై చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన ముష్టిఘాతాలు కురిపించాడు. దీంతో, శశాంక్ బంధువుతో పాటు మరో మహిళ బాధితుడిని పక్కకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, ఈ దాడిలో శశాంక్ తలకు, కంటికి తీవ్రగాయాలైనట్టు కూడా తెలిసింది.
ఘటనపై జెప్టో స్పందించింది. విచారం వ్యక్తం చేసింది. తమ డెలివరీ ఏజెంట్లు ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలని తాము ఆశిస్తామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు, పోలీసులు ఆ డెలివరీ ఏజెంట్‌పై భారతీయ న్యాయ సంహిత ప్రకారం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
ఏటా రూ.7 లక్షలిచ్చి గూగుల్ ఉద్యోగుల్లా పనిచేయమంటే ఎలా.. నెట్టింట టెకీ ఆవేదన
తన కంపెనీని కాళ్ల బేరానికి రప్పించిన మహిళా ఉద్యోగి