Share News

Women Gets Rehired: తన కంపెనీని కాళ్ల బేరానికి రప్పించిన మహిళా ఉద్యోగి

ABN , Publish Date - May 23 , 2025 | 08:39 PM

ఓ మహిళా ఉద్యోగి రాజీనామా చేశాక సంస్థకు ఆమె విలువ తెలిసొచ్చింది. దీంతో, 55 శాతం జీతం పెంచి మరీ ఆమెను సంస్థ యాజమాన్యం మళ్లీ ఉద్యోగంలో నియమించుకుంది.

Women Gets Rehired: తన కంపెనీని కాళ్ల బేరానికి రప్పించిన మహిళా ఉద్యోగి
Women Gets Rehired

ఇంటర్నెట్ డెస్క్: తను పని చేస్తున్న సంస్థలో జీతాలు పెరగకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయిందా మహిళా ఉద్యోగి. ఆమె విలువ తెలిసొచ్చాక కాళ్ల బేరానికి వచ్చిన సంస్థ ఏకంగా 55 శాతం పెంచుతామంటూ ఆఫర్ ఇచ్చింది. రాజీనామా చేసిన రెండు నెలలకే సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అసలు ఏం జరిగిందో చెబుతూ సదరు మహిళా ఉద్యోగి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సదరు మహిళా ఉద్యోగి రెడిట్‌లో ఈ పోస్టు పెట్టుకొచ్చింది. తను సంస్థలో నిబద్ధతతో పని చేశానని ఆమె చెప్పుకొచ్చింది. జీతం పెంచమని అడిగితే సంస్థ యాజమాన్యం సాకులు చెప్పిందని పేర్కొంది. ‘‘జీతం పెంచమని అడిగితే నాకు అనుభవం తక్కువని అన్నారు. మంచి అవకాశాలు వస్తాయని సోది చెప్పారు. బడ్జెట్ లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు నాకు చిరాకొచ్చి సంస్థకు గుడ్‌బై చెప్పేశా’’ అని ఆమె రెడిట్‌లో రాసుకొచ్చారు.


ఆ తరువాత కంపెనీలో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైందని వివరించింది. ‘‘ఒక్క పనీ సమయానికి జరిగేది కాదు. క్లైంట్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. చిందర వందరగా మారింది’’ అని ఆమె అన్నారు.

తాను మాత్రం తన దారి తాను చూసుకున్నట్టు తెలిపారు. మరో సంస్థలో ఎక్కువ శాలరీకి చేరినట్టు చెప్పారు. ‘‘కొత్త జాబ్‌లో చేరిన రెండో నెలలకే నాకు పాత సంస్థ నుంచి కాల్ వచ్చింది. 45 శాతం జీతం పెంచిస్తామని ఆఫర్ చేశారు. నేను ఒప్పుకోలా.. దీంతో, 55 శాతం మేర జీతం పెంచుతామన్నారు. ప్రమోషన్ కూడా ఇస్తామన్నారు. మరిన్ని ఇంటరెస్టింగ్ ప్రాజెక్టులతో పాటు పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్నారు. దీంతో నేను అంగీకరించాను’’ అని ఆమె అన్నారు.


‘‘కాబట్టి నేను చెప్పేదేంటంటే. నీ సమర్థతను రుజువు చేసుకోవాలంటే ఒక్కోసారి ఇలా రిజైన్ చేసి వెళ్లిపోక తప్పదు. అప్పుడే నీ విలువ ఏంటో అవతలి వారికి తెలుస్తుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భయం వద్దు’’ అని ఆమె పేర్కొంది. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలా చేస్తేనే లైఫ్‌లో విజయం సాధించొచ్చని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

పనిలో టాలెంట్ చూపించారని ప్రమోషన్ నిరాకరణ.. నెట్టింట ఉద్యోగి ఆవేదన

పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

Read Latest and Viral News

Updated Date - May 23 , 2025 | 08:39 PM