Share News

Watch Video: దుర్గమ్మ గుడి ముందు అద్భుతం.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..!

ABN , Publish Date - Sep 26 , 2025 | 09:42 PM

దేశ వ్యా్ప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా భక్తి ప్రపత్తులతో దుర్గామాతను పూజిస్తున్నారు. కొందరు తమ తమ ఇళ్లలో పూజలు చేస్తే.. మరికొందరు మంటపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను..

Watch Video: దుర్గమ్మ గుడి ముందు అద్భుతం.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..!
Durga temple lion video

Lion appear in front of the Maa Durga temple: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా భక్తి ప్రపత్తులతో దుర్గామాతను పూజిస్తున్నారు. కొందరు తమ తమ ఇళ్లలో పూజలు చేస్తే.. మరికొందరు మంటపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను పూజిస్తున్నారు. తొమ్మిది రోజులు దీక్ష పూని నియమ నిష్టలతో అమ్మవారిని కొలుస్తున్నారు భక్తులు. దీంతో అమ్మవారి ఆలయాలు, మంటపాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. అయితే, దేవీ నవరాత్రుల వేళ ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి భక్తులంతా అంతా అమ్మ మహిమ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


వైరల్ అవుతున్న వీడియోలో దుర్గామాత గుడి ఉంది. రాత్రి సమయంలో ఆ గుడి వద్దకు ఓ సింహం వచ్చింది. గుడి ముంగిట కూర్చుని అమ్మవారి విగ్రహం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. దీనిని గమనించిన కొందరు తమ ఫోన్‌తో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇది ఏఐ వీడియో అని కొందరు.. మరికొందరు భక్తి పారవశ్యంతో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఏఐ వీడియోనో, లేక నిజమైన వీడియోనో గానీ.. ప్రజలు మాత్రం.. దుర్గమ్మ గుడి ముందు ఆమె వాహనమైన సింహం ఉండటాన్ని చూసి మురిసిపోతున్నారు. సింహవాహిని దుర్గమ్మను స్మరిస్తూ జై దుర్గా భవాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

వీడియోను కింద చూడొచ్చు..


ఇవి కూడా చదవండి..

I Love Muhammad Row: ముదిరిన వివాదం.. బరేలిలో ఘర్షణలు, పోలీసుల లాఠీచార్జి

Asia Cup Cricket : ఆసియా కప్ క్రికెట్: బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక, మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్

Updated Date - Sep 26 , 2025 | 09:42 PM