I Love Muhammad Row: ముదిరిన వివాదం.. బరేలిలో ఘర్షణలు, పోలీసుల లాఠీచార్జి
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:58 PM
'ఐ లవ్ మహమ్మద్' ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు.
లక్నో: కొన్నివారాల క్రితం మొదలైన 'ఐ లవ్ మహమ్మద్' (I Love Muhammad) పోస్టర్ వివాదం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బరేలి(Bareilly)లో ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక వర్గం వారు పెద్దఎత్తున గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. దీంతో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి.

'ఐ లవ్ మహమ్మద్' ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్దఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతోపాటు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.
ముందస్తు కుట్ర.. 10 మంది పోలీసులకు గాయాలు
ఆందోళనకారుల దాడిలో 10 మంది పోలీసులు గాయపడినట్టు బరేలీ ఇన్‌స్పెక్టర్ అజయ్ సాహ్ని తెలిపారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నమాజ్ పూర్తికాగానే ఇళ్లకు చేరుకోవాలని ప్రజలను కోరామని, అయితే గుంపులోని కొందరు రాళ్లు రువ్వుతూ కాల్పులకు దిగారని చెప్పారు. ఘటన స్థలిలో కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇది ముందస్తు కుట్రగా కనిపిస్తోందన్నారు.
ఈనెల 4న మొదలైన వివాదం
కాన్పూర్‌లో ఈనెల 4న మిలాద్-ఉన్-నబి ఊరేగింపు సందర్భంగా మార్గమధ్యంలో ఒక టెంట్‌కు 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్ తగిలించారు. ఈ లైట్‌బోర్టుపై స్థానిక హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆ టెంట్‌ను పోలీసులు తొలగించారు. 9 మంది గుర్తుతెలియని వ్యక్తులతో సహా 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కాన్పూర్ ఘటనను ఏఐఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఒవైసీ సమర్ధించారు. ఎవరైనా 'ఐ లవ్ యూ' చెబితే అందులో సమస్య ఏముంది? ఈ చర్యతో ముస్లిం దేశాలకు మీరు ఏమి చెప్పదలచుకున్నారు? 'ఐ లవ్ మహదేవ్' అంటే తప్పుందా? ఆ విధంగా చేసుకోవచ్చు, అది వారి విశ్వాసం. ఇది ఒకరకంగా ముస్లింలను సామాజికంగా బాయ్‌కాట్ చేయడమేనని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
యోగిని పాతిపెడతాం.. రెచ్చిపోయిన మౌలానా
లద్దాఖ్ హింస.. వాంగ్‌చుక్ అరెస్టు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి