CM Yogi Adityanath: యోగిని పాతిపెడతాం.. రెచ్చిపోయిన మౌలానా
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:05 PM
యోగిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అష్ఫాక్ నిసార్ షేక్‌గా గుర్తించారు. చాలా రోజుల క్రితమే ఆయన ఈ హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే ఆ వీడియో విడుదలైంది.
బీడ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)పై ముస్లిం మత నేత ఒకరు రెచ్చిపోయారు. యోగిని పాతిపెడతామంటూ బహిరంగ హెచ్చరిక చేశారు. మహారాష్ట్రలోని బీడ్ (beed)లో జరిగిన 'ఐ లవ్ మహమ్మద్' ప్రోగ్రాంలో మౌలానా ఒకరు ఈ వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
యోగి ఆదిత్యనాథ్‌ను తన ప్రసంగంలో మౌలానా దూషిస్తూ, మాజల్‌గావ్‌లోని ముస్తఫా మసీదుకు యూపీ సీఎం రావాలని సవాలు చేశారు. ఆయన గనుక వస్తే అక్కడే పాతిపెడతారని హెచ్చరించారు. యోగిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అష్ఫాక్ నిసార్ షేక్‌గా గుర్తించారు. చాలా రోజుల క్రితమే ఆయన ఈ హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే ఆ వీడియో విడుదలైంది. యోగిని మౌలానా బెదిరించడంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మౌలానాపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం వీడియో విశ్వసనీయతను పరిశీలిస్తున్నారు.
ఏమిటీ 'ఐ లవ్ మహమ్మద్' ప్రచారం..
మహమ్మద్ ప్రవక్త జయంత్యుత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ కాన్పూరులో బారావఫత్ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో 'ఐ లవ్ మహమ్మద్' ప్రచారం చేపట్టారు. ప్రవక్తపై తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ముస్లిం యువకులు 'ఐ లవ్ మహమ్మద్' అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. అయితే చాలా వేగంగానే హిందూ గ్రూపులు ఈ చర్యను వ్యతిరేకించాయి. రెచ్చగొట్టే కొత్త సంప్రదాయంగా దీనిని విమర్శించాయి.
పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికారులు ఈ బ్యానర్లను తొలగిస్తూ, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారనే అభియోగంపై పలువురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఆ తర్వాత లక్నో, బరేలి, నాగపూర్, హైదరాబాద్‌లోనూ శుక్రవారం ప్రార్థనల తరువాత ఇదే తరహా ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. తమ ప్రదర్శనలపై పోలీసు చర్య అన్యాయమని, తమ ప్రాథమిక హక్కులు, మత స్వేచ్ఛకు విరుద్ధమని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
లద్దాఖ్ హింస.. వాంగ్‌చుక్ అరెస్టు..
సిక్కుల మనుగడపై వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీకి హైకోర్టులో చుక్కెదురు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి