Share News

Asia Cup Cricket : ఆసియా కప్ క్రికెట్: బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక, మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:22 PM

దుబాయ్‌లో జరుగుతున్న 2025 ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

Asia Cup Cricket : ఆసియా కప్ క్రికెట్: బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక, మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్
Asia Cup Cricket

దుబాయ్‌, సెప్టెంబర్ 26 : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 2025 ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతోంది. మొత్తం 19 మ్యాచ్ ల టోర్నమెంట్ లో ఇది 18వ మ్యాచ్‌. స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్‌ ముందుకు సాగుతుండగా, శ్రీలంకకు కెప్టెన్ చరిత్ అసలంక నాయకత్వం వహిస్తున్నారు. ఇవాళ్టి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ భారత ఆటగాళ్లు ప్రారంభించారు. భారత బ్యాట్స్ మెన్ దూకుడెలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడోనని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే అభిషేక్ ఫ్యాన్స్ కు పండుగ చేస్తుండగా, మరో ఓపెనర్ గిల్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కు వచ్చాడు.


ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 08:27 PM