EPFO:ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా.. ఈ స్కీం కింద నెలకు రూ.7500..
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:32 PM
ప్రైవేటు జాబ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే..

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీరు పదేళ్లుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంటున్నారా. అయితే, మీ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.7500 జమ అయినట్లే.. ఆర్గనైజ్డ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు EPFO ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సంస్థలో సభ్యులైన ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైంది ఈ సంస్థ. ఉద్యోగులు పనిచేసినంత కాలం, రిటైరైన తర్వాతా వారికి ఎన్నో ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు రకరకాల స్కీంలు అమలుచేస్తోంది. అయితే, ఇప్పటి వరకూ విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద నెలకు రూ.1000లు మాత్రమే ఇస్తూ వచ్చింది EPFO. ఈ మధ్యే ఆ మొత్తాన్ని రూ.7500లకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించింది. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు.. గతంతో పోలిస్తే ఇప్పుడెలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి.. తదితర వివరాలు..
ఉద్యోగుల భవిష్యత్తు అవసరాలు తీర్చేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఆర్గనైజేషన్‌లో సభ్యులుగా ఉండే ఉద్యోగులకు ఆర్థికపరంగా వివిధ రకాల వెసులుబాట్లు కల్పిస్తోంది. అందులో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్ (EPF)లేదా పీఎఫ్ స్కీంను లాంచ్ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు అండగా ఉండటమే లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చింది.
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)1995 నవంబర్ 16న తీసుకొచ్చారు. ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ (1971) స్థానంలో దీన్ని ప్రవేశపెట్టింది EPFO.ఇప్పటివరకూ ఈ స్కీం కింద రిటైరైన వారికి నెలకు రూ.1000లు వచ్చేది. ఇప్పుడా మొత్తాన్ని రూ.7500లకు పెంచుతున్నట్లు తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద అయితే సభ్యుడి మరణం తర్వాతే కుటుంబానికి పెన్షన్ వచ్చేది. EPS కింద అలా కాదు. సభ్యులతో పాటు వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించడం ద్వారా ఆర్థిక ఆసరా కల్పిస్తోంది.
ఏఏ ఉద్యోగులు అర్హులంటే..
ఏదైనా ఆర్గనైజ్‌డ్ సంస్థలో 10ఏళ్లకు పైగా సర్వీస్ చేస్తూ EPFOలో సభ్యులుగా ఉన్న ఉద్యోగులు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు అర్హులు. ఉద్యోగం చేసే సమయంలో జీతం నుంచి EPSకి క్రమం తప్పకుండా సంబంధిత మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. 58 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. నెల నెలా రూ.7500లు వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. EPS-95 పెన్షనర్ల వరస విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం EPS పెన్షన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.7500లకు పెంచుతూ కీలక నిర్ణయం వెలువరించింది.
ఈపీఎస్ పెన్షన్ గురించి..
EPFOలో సభ్యులైన ఉద్యోగుల జీతం నుంచి నెలనెలా కొంత భాగం EPF (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్), EPS అకౌంట్‌లో జమ అవుతుంది. బేసిక్ శాలరీ నుంచి 12% EPFకి చేరుతుంది. కంపెనీ కూడా అంతే మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో 8.33% EPSకి, 3.67% EPFకి వెళుతుంది.
EPS పెన్షన్ ఫార్ములా:
ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ.20,000 అయితే, ఆ వ్యక్తి 10 సంవత్సరాలు పనిచేశారు అనుకుంటే..
పెన్షన్ = రూ 20,000 ×10 ÷ 70 = నెలకు రూ 2,857.14