Share News

IT Layoffs: 35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన

ABN , Publish Date - Dec 17 , 2025 | 10:35 AM

35 ఏళ్ల వయసులో జాబ్ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయానంటూ ఓ టెకీ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. అతడి పరిస్థితి అనేక మందిని కదిలించింది.

IT Layoffs: 35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన
IT Layoffs Techie Post Goes Viral

ఇంటర్నెట్ డెస్క్: ఐటీ రంగంలో ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ టెకీ పెట్టిన పోస్టు నెటిజన్లను కదిలిస్తోంది. 35 ఏళ్ల వయసులో తనకు జాబ్ పోయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న తను ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయానంటూ ఈ పోస్టు పెట్టారు (IT Layoffs Impact).

‘ నా వయసు 35 ఏళ్లు, ఇటీవలే జాబ్ పోయింది. అసలు ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని, ఇలా పోస్టు పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. నన్ను బాగా భయపెడుతోంది ఏంటంటే.. ఇప్పటివరకూ నేను డబ్బు పొదుపు చేయలేదు. నాకు కుటుంబం ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల స్కూలు ఫీజులు చాలా ఎక్కువ. ఇక ఇంటి అద్దె, ఈఎమ్‌ఐలు, అన్నీ నెలతిరిగే సరికల్లా వచ్చి పడుతుంటాయి. కానీ జీతం మాత్రం ఆగిపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను చాలా కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నట్టు ఆయన తెలిపారు. జాబ్ స్థిరత్వం ఏదోక రోజు వస్తుందనే భావనలోనే చాలా ఏళ్లు గడిచిపోయాయని అన్నారు. కానీ అది ఎన్నటికీ సాకారం కాని కలగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పనితీరు మెరుగ్గానే ఉన్నా లేఆఫ్స్‌కు గురయ్యానని, కంపెనీలో ఖర్చుల తగ్గింపు, పునర్‌వ్యవస్థీకరణ కారణంగా జాబ్ కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు.


IT Layoffs 2.jpg

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో కూడా గడ్డు పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. ‘కుటుంబం ముందు ధైర్యం నటిస్తున్నా. రాబోయే రోజుల్ని ఎలా నెట్టుకు రావాలో తలుచుకుంటే కంటి మీదకు కునుకు రావట్లేదు. అంతా సర్దుకుంటుందన్న మాట తరచూ వినేదే అయినా నాకు నమ్మకం కుదరట్లేదు’ అని అన్నారు.

ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందుగా కఠిన పొదుపు నియమాలు పాటించి ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలని సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

బ్రిటీషర్ల నుంచి నేను నేర్చుకున్నవి ఇవే.. ఎన్నారై పోస్టు వైరల్

తెల్లవారుజామున ఊహించని సీన్! దుబాయ్‌లో భారతీయ మహిళకు ఆశ్చర్యం

Read Latest and Viral News

Updated Date - Dec 17 , 2025 | 10:46 AM