Dubai Traffic Rules: తెల్లవారుజామున ఊహించని సీన్! దుబాయ్‌లో భారతీయ మహిళకు ఆశ్చర్యం
ABN , Publish Date - Dec 15 , 2025 | 08:21 AM
తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోయినా ఓ వాహనదారుడు పక్కాగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయిన ఓ భారతీయ మహిళ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు ఉన్నది వాహనదారుల భద్రత కోసమే. కానీ కొందరికి ఈ రూల్స్‌ను ఫాలో కావాలంటే ఎందుకో తెలియని అసహనం. ఎవరూ చూడట్లేదనుకుంటే హ్యాపీగా నిబంధనలను అతిక్రమించేస్తుంటారు. అయితే, ఇందుకు భిన్నమైన దృశ్యం దుబాయ్‌లో కనిపించడంతో ఓ భారతీయ మహిళ ఆశ్చర్యపోయింది. ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది (Dubai Traffic Rules Viral Video).
నేహా జైస్వాల్ అనే మహిళ ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. దుబాయ్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కనిపించిన దృశ్యం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నిర్మానుష్యంగా ఉన్న ఆ సమయంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఓ కారు ఆగింది. రెడ్ సిగ్నల్ ఉన్నంత సేపు కారు అలాగే ఉండిపోయింది. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడ్డాకే ముందుకు కదిలింది. చుట్టుపక్కల మరే వాహనమూ లేకపోయినా, రోడ్డంతా ఖాళీగా ఉన్నా కూడా కారు డ్రైవర్ రూల్స్‌ను అతిక్రమించే సాహసం చేయలేదు. బాధ్యతగల పౌరుడిగా నిబంధనలను ఫాలో అయ్యాడు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఈ వీడియో షేర్ చేసిన మహిళ ఆశ్చర్యపోయింది. ‘దుబాయ్ చాలా డిఫరెంట్.. తెల్లవారుజామున 4 గంటలు అయినా రూల్స్ అంటే రూల్సే’ అంటూ కామెంట్ పెట్టింది.
ఇక ఈ వీడియోకు జనాలు సహజంగానే బ్రహ్మరథం పట్టారు. ఎవరూ చూడకపోయినా బాధ్యతగా నడుచుకుంటూ నిబంధనలు ఫాలో అయినందుకు కారు డ్రైవర్‌ను ప్రశంసించారు. దూబాయ్‌లో పరిస్థితి అలాగే ఉంటుందని అనుభవజ్ఞులు చెప్పారు. ఏ సమయంలోనైనా రూల్స్ పాటించాల్సిందేనని, అక్కడ నిఘా పటిష్ఠంగా ఉంటుందని చెప్పారు. కట్టుతప్పితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి జనాల్లో క్రమశిక్షణ అద్భుతంగా ఉందని మరికొందరు ప్రశంసించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
రూ.24.6 లక్షల బ్యాగును రోడ్డుపై వదిలెళ్లిపోయిన మహిళ! చివరకు..
తరచూ బాత్రూమ్‌కు వెళ్లే ఉద్యోగికి ఊస్టింగ్! కోర్టులో కేసు వేస్తే..