Share News

Black Budget: ఇండియన్ ‘బ్లాక్ బడ్జెట్‌‌’.. దీని వెనుక కథేంటో మీకు తెలుసా..

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:20 AM

వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Black Budget: ఇండియన్ ‘బ్లాక్ బడ్జెట్‌‌’.. దీని వెనుక కథేంటో మీకు తెలుసా..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేళపెట్టనుంది. దీంతో భారతీయుల దృష్టి మొత్తం ఈ బడ్జెట్ పైనే పడింది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇంకే వస్తువుల ధరలు తగ్గుతాయి అనే విషయాలపై సామాన్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బడ్జెట్‌లో ఇంధన ధరలపై సుంకాలను తగ్గించానే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా బ్లాక్ బడ్జెట్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్‌ను (2025 Annual Budget) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న మొత్తం రూ.50 లక్షల కోట్లకుర పైగా విలువగల బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 1947 నుంచి ఇప్పటిదాకా వరుసగా బడ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్నా కూడా.. 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు. దానికి బ్లాక్ బడ్జెట్‌గా (Black Budget) పేరు పెట్టడమే ఇందుకు కారణం. ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం..


ఇండియా, పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దేశ వ్యాప్తంగా కరువు ఏర్పడింది. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం కూడా భారీగా దెబ్బతింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య అప్పటి ప్రధానమంతి ఇందిరా గాంధీ నాయకత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో దేశంలో అప్పడు నెలకొన్న దుర్భర పరిస్థితులను చవాన్ తన ప్రసంగంలో వివరించారు.


అలాగే అప్పటి పరిస్థితుల్లో యుద్ధం కారణంగా ఖర్చులు పెరగడం, రాబడి తగ్గిపోవడంతో ఆ ఏడాది బడ్జెట్‌లో రూ.550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. దేశంలోని జనరల్ బీమా కంపెనీలు, బొగ్గు గనులను ప్రభుత్వ పరం చేసేలా ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఈ బడ్జెట్‌ను అప్పట్లో అధికార, విపక్షాలు.. బ్లాక్ బడ్జెట్‌గా పిలుచుకున్నాయి. అయితే అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బొగ్గు గనులు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్, బీమా కంపెనీల జాతీయీకరణ కోసం రూ.4 కోట్ల కేటాయించారు. అనవసర ఖర్చులు తగ్గించి, దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

Updated Date - Jan 31 , 2025 | 11:20 AM