A Viral Selfie Video: బతికించండి మహాప్రభో.. సౌదీ ఎడారిలో భారతీయుడి వీడియో..
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:03 PM
సౌదీ అరేబియా ఎడారిలో తన యజమాని(కపిల్) చేతిలో చిక్కుకుపోయిన ఒక భారతీయ కార్మికుడు సెల్ఫీ వీడియోలో తన దయనీయ స్థితిని తెలియజేశాడు. 'దయచేసి సహాయం చేయండి, లేదంటే నాకు చావే శరణ్యం' అని కన్నీరు పెట్టుకుంటూ ప్రధాని..
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియా ఎడారిలో తన యజమాని(కపిల్) చేతిలో చిక్కుకుపోయిన ఒక భారతీయ కార్మికుడు సెల్ఫీ వీడియోలో తన దయనీయ స్థితిని తెలియజేశాడు. 'దయచేసి సహాయం చేయండి, లేదంటే నాకు చావే శరణ్యం' అని కన్నీరు పెట్టుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ను అభ్యర్థించాడు. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో తన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ జిల్లా, హండియా మండలం, ప్రతాప్‌పూర్ గ్రామానికి చెందిన ఈ కార్మికుడు, తనుకు ఉద్యోగమిచ్చిన యజమాని తన పాస్ పోర్ట్ పట్టుకుని తనను ఇండియాకు రానివ్వడం లేదని మొరపెట్టుకున్నాడు. ఇండియా వెళ్లిపోతానంటే, చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయాడు. నా తల్లిని చూడాలని ఉందని భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియా యూజర్లను 'ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయండి, మీ సహకారంతో భారత ప్రభుత్వం నన్నువిడిపిస్తుంది' అని కోరాడు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో రియాధ్‌లోని భారతీయ రాయబారి కార్యాలయం స్పందించింది. 'సదరు వ్యక్తిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, వీడియోలో అతను ఎక్కడున్నాడన్న ప్లేస్, ప్రావిన్స్, కాంటాక్ట్ నంబర్ లేదా యజమాని వివరాలు లేకపోవడంతో మరిన్ని చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయ్' అని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి