Doctor Suicide Case: మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:48 AM
మహారాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. గత ఐదు నెలల్లో ఎస్సై గోపాల్ బాద్నే తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆమె చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: మహారాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. గత ఐదు నెలల్లో ఎస్సై గోపాల్ బాద్నే తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆమె చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులోపోలీసులు చేసిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మరో 4 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని సదరు మహిళా డాక్టర్ రాసుకొచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకూ తీసుకురాలేదని.. అందుకు తాను ఒప్పుకోలేదని దారుణంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారు అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేసును వెంటనే దర్యాప్తు చేసి, నిజానిజాలను వెల్లడించాలని, మహిళా డాక్టర్ చేసిన ఆరోపణలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి ఫడణవీస్ ఆదేశాల మేరకు మహిళా డాక్టర్ ఆరోపణలు గుప్పించిన ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
Bus Accident: బెంగళూరులో 30 బస్సులు సీజ్
PM Modi: నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది