Missed Harvard Admission: యువకుడి జీవితంలో ట్విస్ట్.. దురదృష్టం వెంటాడటంతో..
ABN , Publish Date - Dec 17 , 2025 | 02:52 PM
ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో తనకు అడ్మిషన్ ఎలా మిస్సైందీ చెబుతూ ఓ వ్యక్తి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లైఫ్ అంటే అంతే అంటూ జనాలు ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనేది ఎందరో విద్యార్థుల కల. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ యూనివర్సిటీకి ఏటా దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇక అడ్మిషన్ లభించిన వారి లైఫ్ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీతో వచ్చే గుర్తింపు, అవకాశాలు యువతను అందలాలు ఎక్కిస్తాయి. ఇలాంటి అద్భుత అవకాశాన్ని దురదృష్టవశాత్తూ చేజార్చుకున్న ఓ యువకుడి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Missed Harvard University Admission).
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనేది తన చిన్ననాటి కల అని సదరు యువకుడు తెలిపాడు. ఇందుకు తగ్గట్టే స్కూలు చదువు తరువాత తాను ఆ యూనివర్సిటీకి దరఖాస్తు చేసినట్టు వివరించాడు. ‘అప్పీల్ లెటర్స్ సహా అన్నీ పద్ధతి ప్రకారం రాసి వారికి పంపించాను. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో, నాకు ఆ అదృష్టం లేదని అనుకున్నాను. ఆ తరువాత విషయాన్ని అక్కడితో మర్చిపోయి జీవితంలో నా ప్రయాణాన్ని కొనసాగించాను. మ్యూజీషియన్‌గా మారాను. కొన్ని పాటలను కూడా సిద్ధం చేశాను. కానీ ఆరు సంవత్సరాల తరువాత ఊహించని విషయం బయటపడింది’
‘ఒక రోజు నేను నా పాత ఈమెయిల్ అకౌంట్‌లోని మెయిల్స్‌ను డిలీట్ చేస్తుండగా హార్వర్డ్ యూనివర్సిటీ మెయిల్ కంట పడింది. తనకు అడ్మిషన్ ఇచ్చినట్టు వారు లేఖ పంపించారు. కానీ నేను ఆ ఈమెయిల్ తెరవనేలేదు. ఒక్కసారి కూడా అటువైపు చూడలేదు. అసలు ఇంత ముఖ్యమైన విషయం నా దృష్టిని ఎలా దాటిపోయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ ఆ మెయిల్ చూడగానే మొదట నా మీద నాకే చాలా అసహ్యం వేసింది. ఆ తరువాత విచారం ముంచెత్తింది. కొంత సేపటికి తరువాత మనసు శాంతించింది. హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినందుకు నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు ఇదంతా తలుచుకుంటే ఒకింత నవ్వు కూడ వస్తోంది’
‘వాస్తవానికి ఈమెయిల్ ప్రభావం నాపై కొంత తక్కువగానే ఉన్నప్పటికీ ఈ విషయాన్ని జనాలతో పంచుకోవాలని అనిపించింది’ అని అన్నాడు.
ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది నిత్యం ఇలా అద్భుత అవకాశాలను కోల్పోతుంటారని చెప్పారు. ఊహించని విధంగా అవకాశాలు కూడా ఎదురొస్తుంటాయని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన
బ్రిటీషర్ల నుంచి నేను నేర్చుకున్నవి ఇవే.. ఎన్నారై పోస్టు వైరల్