Share News

Optical Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ కొంగ మధ్యలో ఉన్న నీటిగుర్రాన్ని 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:19 AM

సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ నీటి కొలను వద్ద చాలా కొంగలు నీళ్లు తాగుతున్నాయి. అయితే ఇదే చిత్రంలో ఓ నీటి గుర్రం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..

Optical Illusion:  మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ కొంగ మధ్యలో ఉన్న నీటిగుర్రాన్ని 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చిత్రాలు చూస్తే పైకి సాధారణంగా అనిపిస్తుంటాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే మాత్రం అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ మరింత బలపడడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొస్తున్నాం. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న చిత్రంలో చాలా కొంగలు కనిపిస్తుంటాయి. కానీ ఈ కొంగల మధ్యలో ఓ నీటి గుర్రం కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో కనుక్కుంటే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.


సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion image) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ నీటి కొలను వద్ద చాలా కొంగలు నీళ్లు తాగుతున్నాయి. వాటిలో కొన్ని కొంగలు నీళ్లు తాగుతుండగా.. మరికొన్ని కొంగలు గట్టుపై నిలబడి ఉన్నాయి.


అవన్నీ ఎర్రటి రంగులో కనిపిస్తుండడంతో చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొంగలకు దూరంగా పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు కనిపిస్తుంటాయి. అయితే ఈ చిత్రంలో కొంగలు, నీళ్లు, మొక్కలు, చెట్లు తప్ప ఇంకేమీ కనిపించవు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో మీ కళ్లకు తెలీకుండా (Hippopotamus Hiding in Water) ఓ నీటి గుర్రం కూడా దాక్కుని ఉంది.


అయితే ఆ నీటిగుర్రం అంత తేలిగ్గా మీ కళ్లకు కనిపించదు. కానీ కాస్త దృష్టి పెట్టి చూస్తే దాన్ని గుర్తించడం పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఆ నీటి గుర్రాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.


ఇంకెందుకు ఆలస్యం.. ఆ నీటి గుర్రం ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఇప్పటికీ ఆ దాన్ని గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Nov 02 , 2025 | 11:19 AM