Share News

Viral Video: కుమార్తె పెళ్లిలో కన్నతండ్రి ఏం చేశాడంటే..

ABN , Publish Date - Oct 31 , 2025 | 05:21 PM

కుమార్తె వివాహ కార్యక్రమంలో ఒక తండ్రి తనదైన శైలిలో వ్యవహరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

Viral Video: కుమార్తె పెళ్లిలో కన్నతండ్రి ఏం చేశాడంటే..

ప్రస్తుతం టెక్నాలజీ అలా ఇలా కాదు.. ఒక రేంజ్‌లో అభివృద్ధి చెందింది. దీంతో చెల్లింపులన్నీ డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. పావలా, అర్ధ రూపాయి నుంచి వేలు, లక్షలు, కోట్ల రూపాయిల వరకు అన్ని లావాదేవీలు ఆ‌న్ లైన్‌లో సాగుతున్నాయి. టీ కొట్టు దగ్గర నుంచి బంగారు నగల దుకాణం వరకు అందరు ఈ క్యూఆర్ కోడ్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతున్నాయి.


Kerala.jpg

అయితే తన కుమార్తె వివాహ కార్యక్రమంలో ఒక తండ్రి తనదైన శైలిలో వ్యవహరించాడు. తెల్ల దుస్తులు ధరించిన ఆ తండ్రి తన షర్ట్ జేబుకు పేటీఎం క్యూఆర్ కోడ్‌ అతికించుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో బంధువులు, స్నేహితుల మధ్య కలియ తిరుగుతూ.. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చదివింపులు జరిపి ఆ నూతన దంపతులను ఆశీర్వదించాలంటూ ఆహుతులను కోరారు. ఈ వివాహ వేడుకకు వచ్చిన వారంతా తమ సెల్ ఫోన్లు ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు చెల్లింపులు జరిపారు.


ఇలా నగదు చెల్లింపులు జరిపేందుకు ఆ ఆహుతులంతా పోటీ పడడం విశేషం. కేరళలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు మంచిగా కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే ఒక్కరు కూడా రూ. 100 నగదును నేరుగా కవర్‌లో పెట్టి ఇవ్వరంటూ జోక్ చేశాడు. ఇదంతా వైట్ మనీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


ఇంకో సోషల్ మీడియా యూజర్ అయితే.. దీనిని యాచించడంతో పోల్చాడు. ఆ వ్యక్తి అలా చేసినందుకు సిగ్గుపడుతున్నాడన్నారు. యాచించడానికి ఇది అద్భుతమైన మార్గమని అభివర్ణించాడు. దీని వల్ల మర్యాద రాదని స్పష్టం చేశాడు. కానీ ఇలా చేయడం బాగుందని ఆ పెళ్లి కూతురు తండ్రి భావిస్తాడని అభిప్రాయపడ్డారు. అయితే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రం మరో విధంగా ఆలోచిస్తారని పేర్కొన్నాడు. ఈ తరహా వ్యక్తులు ఎప్పటికీ మారరంటూ సదరు వ్యక్తి తన వ్యాఖ్యల ద్వారా కుండబద్దలు కొట్టాడు.


వీటిని కూడా చదవండి..

వామ్మో.. ఏంటిదీ.. ఇంత భక్తి ఎక్కడైనా చూశారా.. రైలు డ్రైవర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2025 | 06:27 PM