Share News

Lord Hanuman: దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

ABN , Publish Date - Dec 23 , 2025 | 10:30 AM

భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.

Lord Hanuman:  దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Famous Hanuman temples in India

హనుమంతుడు భారతీయ సంస్కృతిలో ఒక దైవం మాత్రమే కాదు, భక్తి, శక్తి, జ్ఞానం, ధైర్యానికి పరిపూర్ణ ఉదాహారణ. రామాయణంలో హనుమంతుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపించిన గొప్ప ఘనత ఆయనది. ఆంజనేయుడు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నారని భక్తులు నమ్ముతారు. రామనామం ఎక్కడ జపిస్తే.. అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటారని విశ్వసిస్తారు. భారత దేశంలో హనుమాన్ ప్రసిద్ద ఆలయాల గురించి తెలుసుకుందాం.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్ ఆంజనేయ స్వామికి ముఖ్యమైన ప్రదేశం అంటారు. ఇక్కడ కొండపై పవిత్రమైన జలపాతం స్వయంగా రాముడు.. హనుమంతుడి కోపాన్ని తగ్గించడానికి సృష్టించారని పురాణ కథనం. ఈ నీటిధార నిరంతరం హనుమంతుడి విగ్రహం పై పడుతుంది. అందుకే దీనిని హనుమాన్ ధార అంటారు. ఇక్కడ శివలింగం, గణేశుడు ఆలయాలతో పాటు పంచముఖ హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ కొండపైకి రోప్ వే లేదా మెట్ల ద్వారా చేరుకోవచ్చు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సంకట మోచన హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ది పొందింది. ప్రముఖ కవి తులసీదాస్ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇక్కడ హనుమంతుడిని దర్శిస్తే.. సమస్త రోగాలు, గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శని దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ది.

sankatmochan.jpgరాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి మీసాలు, గడ్డం ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే ‘బాలాజీగా స్వామివారిని కొలుస్తారు.


అయోధ్యలోని ఒక ప్రసిద్ధ పురాతన దేవాలయం హనుమాన్ గర్హి. ఇక్కడ భక్తులు ఇప్పటికీ శ్రీరాముడి కోసం హనుమంతుడు కాపలా కాస్తున్నాడని నమ్ముతారు. అయోధ్యలో రాముడి గర్భాలయం పక్కనే ఉన్నందున భక్తులు చాలా పవిత్రమైన స్థలాంగ భావిస్తారు. ఇక్కడ హనుమాన్ భక్తులకు ధైర్యం, బలం, ఆధ్యాత్మిక రక్షణ కల్పిస్తారని విశ్వసిస్తుంటారు.

hanuma-garhi.jpgరాజస్థాన్‌లోని హందీపూర్ బాలాజీ ఆలయం దుష్ట శక్తులు, గ్రహ పీడల నివారణకు ప్రసిద్ధి. దిష్టి తాకినా, ఏదైనా ఇంట్లో దుష్టశక్తి ఉన్నా, మంత్రాల ప్రభావానికి లోనైన వారు ఇక్కడి వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకొని తమ కష్టాలు తొలగిపోవాలని పూజిస్తారు. ఇక్కడ స్వామి వారికి ఉండే శక్తుల వల్ల మానసిక సమస్యలు, నెగిటీవ్ ఎనర్జీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

kast bajang.jpgఇవే కాకుండా గుజరాత్, సారంగపూర్ లోని కష్ట్ భంజన్ హనుమాన్, తమిళనాడులోని నామక్కల్ లో ఉన్న ఆంజనీయ స్వామి గుడి, తెలంగాణలోని కొండగట్టులో ఉన్న అంజన్న, హిమాచల్ ప్రదేశ లోని సిమ్లాలో జాఖూ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Updated Date - Dec 23 , 2025 | 11:34 AM