Dolphins Viral Video: ముంబయి సముద్ర తీరంలో డాల్ఫిన్ల ఆటలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:13 PM
ముంబయి వర్లీ సముద్ర తీరంలో డాల్ఫిన్లు సందడి చేశాయి. ఓ చిన్నపాటి డాల్ఫిన్ల గుంపు తీర సమీపంలో ఆడుకుంటూ చూపరులను దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: డాల్ఫిన్లు(Dolphins) సామాజిక జీవులు. ఇవి గుంపుగా కూడి సముద్రం అంచుకు దూరంగా నివాసం సాగిస్తుంటాయి. అలాంటి డాల్ఫిన్లు.. ఇటీవల ముంబయి(Mumbai)లోని వర్లీ సముద్ర(Worli Sea) తీరానికి చేరాయి. ఆ ప్రాంతంలో డాల్ఫిన్ల సమూహం ఈదుతూ, అటూ ఇటూ దుముకుతూ.. చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ అందమైన దృశ్యాలను సవిన్ చౌహన్ అనే వ్యక్తి వీడియో తీసి తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి (Dolphins Viral Video).
వర్లీ సముద్ర ముఖ ద్వారం వద్ద నిల్చున్న కొందరు పర్యటకులు అలా నీటివైపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో డాల్ఫిన్ల గుంపు ఒకటి బయటకు వచ్చింది. అవి అలా ఈదుతూ ఆడుకుంటూ తీరాని సమీపంగా వచ్చాయి. ట్రైనింగ్ ఇచ్చిన వాటిలా.. మునుగుతూ తేలుతూ ఆడుకుంటూ అక్కడవారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'బిట్వీన్ కాంక్రీట్ అండ్ చావోస్, ఎ డాల్ఫిన్ మూమెంట్' అనే క్యాప్షన్ జోడించారు చౌహాన్. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వీక్షకులు అమితానందంగా స్పందిస్తున్నారు. ముంబయి తీర ప్రాంతంలో డాల్ఫిన్‌లను చూడటం చాలా హ్యాపీగా ఉందని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. సముద్రంతో ముంబయి నగరానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుందని మరికొందరు కామెంట్ చేశారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు ఓ చక్కటి అవకాశం లభించిందని ఇంకొందరు పేర్కొన్నారు.
అయితే.. ముంబయి సమీపంలో డాల్ఫిన్లు కనిపించడం ఇదే తొలిసారి కాదు. కరోనా లాక్‌డౌన్(Corona Lockdown) సమయంలో.. అనేక జంతువులు, పక్షులు మానవ ఆవాసాలకు దగ్గరగా వచ్చాయి. 2020 డిసెంబర్‌లో వాషి క్రీక్(Vashi Creek)లో డాల్ఫిన్లు ఈతకొడుతూ ఆడుకుంటున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇది స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.
ఇవీ చదవండి: