Share News

Viral News: రూ.700 కమ్మల కోసం రూ.1.2 కోట్ల నగలు అమ్మేసింది.. నీకో దండం తల్లి

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:59 AM

Viral: స్టైలిష్‌గా ఉండాలి, అందంగా కనపడాలని అనుకోవడంలో తప్పు లేదు. ట్రెండ్‌కు తగ్గట్లు లుక్స్‌ను మార్చుకుంటే అప్పీయరెన్స్ బాగుంటుంది. కానీ అది పిచ్చిగా మారితే ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి.

Viral News: రూ.700 కమ్మల కోసం రూ.1.2 కోట్ల నగలు అమ్మేసింది.. నీకో దండం తల్లి
Viral News

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ట్రెండ్‌కు తగ్గట్లు ఫ్యాషన్‌గా కనిపించాలి, లుక్స్‌ను మార్చుకోవాలి, అందరిలో కాస్త ప్రత్యేకంగా ఉండాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. అందుకోసం బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు స్టైలింగ్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా కొందరు వెనుకాడరు. అయితే అందరి కంటే స్పెషల్‌గా కనిపించాలనే ఆశ పెరిగి పిచ్చి వరకు వెళ్తే విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఓ ఘటనే ఇది. రూ.700 కమ్మల కోసం ఓ అమ్మాయి ఏకంగా రూ.1.2 కోట్లు విలువ చేసే విలువైన నగల్ని అమ్మేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


ఏకంగా తల్లి నగలనే..

చైనాలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెదాలకు పెట్టుకునే స్టడ్స్‌, చెవి కమ్మల కోసం ఓ అమ్మాయి తన తల్లి నగలను దొంగిలించింది. వాటిని తీసుకెళ్లి ఓ షాప్‌లో అమ్మేసి తనకు కావాల్సిన స్టడ్స్ కొనుక్కుంది. ఆమె ఇంట్లో నుంచి తీసుకెళ్లిన జువెల్లరీ విలువ రూ.1.2 కోట్లు కాగా.. తను కొనాలని అనుకున్న లిప్ స్టడ్స్ ధర రూ.700 కావడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పేరు లీ అని తెలుస్తోంది. కూతురు చేసిన పని గురించి ఇంట్లో పెద్దలకు తెలియదు. లీ తల్లి వాంగ్ సడన్‌గా బీరువా తెరిచి చూస్తే నగలు కనిపించకపోవడంతో ఆమె షాకైంది.


కూతురు పనికి షాక్!

కూతుర్ని గట్టిగా నిలదీయగా లిప్ స్టడ్స్, చెవి కమ్మల కోసం నగల్ని అమ్మేసిన విషయాన్ని బయటపెట్టింది. దీంతో లబోదిబోమన్న వాంగ్ వెంటనే షాంఘై పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చింది. దీంతో విచారించిన పోలీసులు లీని ప్రశ్నించారు. ఆ నగలు ఏం చేశావని అడిగారు. బ్రేస్‌లెట్, నెక్లెస్‌, జెమ్‌స్టోన్‌ను తీసుకెళ్లి పాకెట్ మనీ కోసం అమ్మేశానని పేర్కొందట.


పోలీసుల ఎంట్రీతో..

‘ఆ రోజు నా కూతురు డబ్బులు కావాలని అడిగింది. ఎంత అని అడిగితే 60 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ.700) కావాలని చెప్పింది. ఆ మనీతో లిప్ స్టడ్స్ కొనుక్కుంటానని తెలిపింది. నేను డబ్బులు ఇవ్వకపోవడంతో నగలు అమ్మేసింది’ అని పోలీసు విచారణలో చెప్పుకొచ్చింది ఆ కూతురి తల్లి. నగలు అమ్మిన డబ్బులతో తను లిప్ స్టడ్స్‌తో పాటు ఒక జత కమ్మలు తీసుకుందని వ్యాఖ్యానించింది. షాపు ఓనర్ మిగతా డబ్బులు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆ దుకాణం యజమాని నుంచి నగల్ని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.


ఇవీ చదవండి:

కెమెరా కన్ను పుస్తకాలే దన్ను

విదేశీ స్నాక్స్‌ తెగ తినేస్తున్నారు.

ఆఫీసులో అడుగడుగునా ఆక్సిజన్‌ మొక్కలే

మరిన్ని ప్రత్యేకం, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 12:45 PM