Share News

Bull Chaos at Wedding: పెళ్లిలో మహిళ నిర్వాకం.. ఎద్దు రెచ్చిపోయేసరికి ప్రమాదంలో పడ్డ అతిథులు..

ABN , Publish Date - May 15 , 2025 | 04:22 PM

పెళ్లిలో అకస్మాత్తుగా రెచ్చిపోయిన ఎద్దు అక్కడున్న వారిపై దాడి చేసింది. అతిథులను ఎత్తి కింద పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన జనాలు.. అసలు తప్పంతా ఓ మహిళదే అని వాదిస్తున్నారు.

Bull Chaos at Wedding: పెళ్లిలో మహిళ నిర్వాకం.. ఎద్దు రెచ్చిపోయేసరికి ప్రమాదంలో పడ్డ అతిథులు..
bull breaks loose

ఇంటర్నెట్ డెస్క్: అక్కడ పెళ్లి జరుగుతోంది. వాతావరణం అంతా సందడిగా ఉంది. డ్యాన్స్‌లు పాటలతో అతిథులు అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ ఎద్దు రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడికి దిగడంతో అంతా షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లికొచ్చిన ఓ మహిళ చేసిన పని వల్లే ఇంత ప్రమాదం జరగిందంటూ వీడియో చూసిన జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మొదట్లో పెళ్లి వేడుకలు సాఫీగానే సాగాయి. పెళ్లి వారంతా డీజే మ్యూజిక్ మధ్య మైమరచిపోయి డ్యాన్స్ చేశారు. కొందరు గాల్లో డబ్బులు ఎగరేశారు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడే ఓ ఎద్దు కూడా ఉంది. దాన్ని జాగ్రత్తగా కట్టేసి ఉంచారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా ఎద్దు రెచ్చిపోయింది. కట్లు తెంచుకుని అక్కడున్న వారిపై దాడికి దిగింది. కొందరిని ఎత్తి కిందపడేసింది. దీంతో, అతిథులందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు కిందపడిపోయారు. ఈ లోపు ఎద్దు స్టేజీమీదకొచ్చి అక్కడున్న వారిపై దాడి చేసే ప్రయత్నం చేసింది.


ఇక వీడియోలో ఇదంతా చూసిన వారు షాకైపోతున్నారు. ఎద్దు దాడి చూసి బెదిరిపోతున్నారు. అయితే, కొందరు వీడియోను జాగ్రత్తగా పరిశీలించి తప్పెవరిదో చెప్పేశారు. ఎద్దు కాలికింద ఉన్న నోటును ఓ మహిళ తీసుకునే ప్రయత్నం చేసిందని కొందరు అన్నారు. దీంతో, ఎద్దుకు ఏం జరుగుతోందో అర్థంకాక బెదిరిపోయి దాడి చేసిందని చెబుతున్నారు. మహిళకు డబ్బుపై కక్కుర్తి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ‘‘ఎద్దు డబ్బు లాక్కునేందుకు మహిళ చేసిన ప్రయత్నమే ఇంతటి ప్రమాదానికి దారి తీసిందని సెటైర్లు పేల్చారు.


ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియోకు 2.5 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 2 వేల పైచిలుకు లైక్స్ కొట్టారు. కామెంట్స్ కూడా దాదాపు అదే స్థాయిలో వచ్చాయి. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

మరాఠీ మాట్లాడితేనే డబ్బులిస్తా.. డెలివరీ ఏజెంట్‌కు షాక్

కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

Read Latest and Viral News

Updated Date - May 15 , 2025 | 04:28 PM