Share News

Bandana Girl: రెండు సెకన్ల వీడియోకి 108 మిలియన్ల వ్యూస్‌.. ఎవరీ 'బందనా గర్ల్'?

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:19 AM

తాజాగా ఓ బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సదరు యువతి పోస్ట్ చేసిన కేవలం రెండు సెకన్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో విడుద‌లైన తక్కువ సమయంలోనే ఏకంగా 100(ప్రస్తుతం 108) మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది

Bandana Girl:  రెండు సెకన్ల వీడియోకి 108 మిలియన్ల వ్యూస్‌.. ఎవరీ 'బందనా గర్ల్'?

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని వీడియోల ద్వారా కొందరు ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోతుంటారు. అలానే మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే ఓ యువతి.. సోషల్ మీడియా కారణంగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సదరు యువతి పోస్ట్ చేసిన కేవలం రెండు సెకన్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో విడుద‌లైన తక్కువ సమయంలోనే ఏకంగా 100(ప్రస్తుతం 108) మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


వీడియో చూసినట్లు అయితే ఆ యువతి ఆటోరిక్షాలో ప్రయాణిస్తూ తన జుట్టుకు బందానా (Bandana) కట్టుకుని, ఒక తెల్లటి వస్త్రాలను ధరించి.. నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ వీడియోకి Makeup ate today అనే మూడు పదాల క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆ అమ్మాయి లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. రెండు సెకన్ల ఈ చిన్న క్లిప్ కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. అంతేకాక అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. దీంతో ఆ యువతికి ‘బందనా గర్ల్’ అనే పేరు వచ్చింది. రెండు సెకన్ల వీడియోకు తక్కువ సమయంలో భారీగా వ్యూస్ రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? లేకుంటే ఏమైనా టెక్నికల్ మాయనా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


ఎవరీ బందనా గర్ల్?

వీడియోలో కనిపించిన యువతిని'బందనా గర్ల్' అని నెటిజన్లు ముద్దుగా పిలుస్తోన్నారు. మరోవైపు ఈమె ఎవరా అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ బందనా గర్ల్ పోస్ట్‌ వైరల్‌ కావడంతో.. పలు మీడియా సంస్థలు ఆమె ఎవరా అని ఆరా తీశాయి. దీంతో ఆమె పేరు ప్రియాంక అని ఓ మీడియా సంస్థ పేర్కొంది. కానీ ఇది ఇంకా ధ్రువీకరణ కాలేదు. అయితే ఆ మీడియా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం.. తన వీడియో ఇంత వైరల్ అవ్వడం.. తానే నమ్మలేకపోతోందట. మహా అయితే వెయ్యి లైకులు వస్తాయని అనుకున్నానని.. కానీ ఇది ఇప్పుడు తన కంట్రోల్‌లో లేదని సదరు యువతి చెప్పినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది.


ఇవీ చదవండి:

కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

Updated Date - Nov 24 , 2025 | 12:02 PM