Punjab Shocker: కత్తి చూపించి దోచే ప్రయత్నం.. దొంగల్ని ఎదిరించిన మహిళలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:34 PM
డబ్బు సంపాదన కోసం కొంతమంది దొంగతనాలు, దోపిడీలకు పాల్పపడుతున్నారు. ఇటీవల పట్టపగలే దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ జరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దోపిడీకోసం వచ్చిన దొంగలను ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో మోసగాళ్లు ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని వారి వద్ద ఉన్న బంగారం, డబ్బు దోచుకెళ్తున్నారు. పంజాబ్, లూథియానాలోని (Ludhiana) కిద్వాన్ నగర్‌లో శుక్రవారం ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూటీపై ఇద్దరు మహిళలు వస్తుండగా.. వారిని దుండగులు అడ్డుకొని కత్తితో బెదిరించి బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళలు దోపిడీ ప్రయత్నాన్ని ఇద్దరు మహిళలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది.
లూథియానాలో మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. వారి పక్క నుంచి ఇద్దరు దొంగలు వచ్చి స్కూటీని ఆపి బ్యాగ్ లాగే ప్రయత్నం చేశారు. కానీ.. ఆ మహిళలు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అందులో ఓ దొంగ బైక్ దిగి పదునైనా కత్తితో వారిని బెదిరించాడు. అయితే, బ్యాగ్ పట్టుకున్న మహిళ పక్కన ఉన్న కారు వెనక్కి వెళ్లింది. కానీ.. వృద్ద మహిళ మాత్రం అక్కడే ధైర్యంగా నిలబడింది. ఆ ప్రదేశంలో జనాలు వస్తున్నది గమనించి దొంగ దొరికిపోతామన్న భయంతో బైక్ ఎక్కి పారిపోయాడు. దొంగలను ఎదుర్కోవడంలో మహిళలు చూపిన ధైర్యాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి ఘటన స్థానిక భద్రత గురించి హైలెట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి