Long Cricket Bat Car: అద్భుతం! 21 అడుగుల క్రికెట్ బ్యాట్ కారు.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:32 PM
క్రికెట్ అంటే చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తెగ ఇష్టపడతారు. క్రికెటర్ బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తుంటే..మావోడు బ్యాట్ పట్టుకుంటే బాదుడే బాదుడు అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోతారు. అలాంటిది పొడవైన బ్యాట్ రూపంలో ఉన్న కారును చూస్తే పిల్లలు ఎలా సంబరపడిపోతారు చెప్పనక్కరలేదు.
హైదరాబాద్‌లోని సుధా కార్స్ మ్యూజియంలో 21 అడుగుల పొడవైన క్రికెట్ బ్యాట్ కారు ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంజన్‌తో నడుస్తున్న ఈ బ్యాట్ కారు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ఇందులో ఒక చిన్న డ్రైవింగ్ క్యాబిన్ కూడా ఉంది. బ్యాట్ కింద భాగంలో నాలుగు చక్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫార్ములా రేస్ కారు నుంచి ప్రేరణ పొంది చేసినట్లు కనిపిస్తుంది. 2007 కరేబియన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్‌కు ముందు ఈ 21 అడుగుల బ్యాట్‌ను ఆపరేషన్ ఇంజన్ తో కూడిన కారుగా మార్చినట్లు ఈ కారును తయారు చేసిన వ్యక్తి వెల్లడించారు.
బ్యాట్‌పై టోర్నమెంట్ లోగో కనిపిస్తుంది. ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.. పెట్రోల్ ట్యాగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్లు ఉన్నాయి. ఇది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని మ్యూజియం సిబ్బంది తెలిపారు. కాకపోతే.. ఈ కారు ప్రదర్శనకు మాత్రమే పనికి వస్తుంది.. రోడ్లపై నడవడానికి పరిమిషన్ లేదని అంటున్నారు. అందుకే దీన్ని సందర్శకుల కోసం మ్యూజియం ప్రాంగణంలోనే పార్క్ చేశారు.
హైదరాబాద్ లో కన్యబోయిన సుధాకర్ కి చెందిన ఈ మ్యూజియంలో ఎన్నో రకాల వస్తువులు ప్రలను ఆకర్శిస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వినూత్న ఆకారంతో వాహనాలు తయారు చేస్తుంటారు. ఈ మ్యూజియంలో ఓ పెద్ద క్రికెట్ బాల్ అందరికీ ఆకర్శిస్తుంది. ముదురు ఎరుపు రంగులో ఉన్న ఈ క్రికెట్ బాల్ మెటల్ తో రూపొందించారు. ఇందులో రియర్‌వ్యూ అద్దాలు, హెడ్ లైట్స్, వెంటిలేషన్, ఇంజన్ ఉంది. ఈ వీడియో @theamazingbharatofficial అనే హ్యాండిల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఏది ఏమైనా పొడవైన బ్యాట్ కారు ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకర్శిస్తుంది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..