Breaking News: గ్రూప్-1 పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా..
ABN , First Publish Date - Apr 30 , 2025 | 08:52 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-30T17:59:38+05:30
గ్రూప్-1 పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా..
రేపు లంచ్ తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ.
వరుస హాల్ టికెట్ల వారికి ఒకే మార్కులు వచ్చాయన్న పిటిషనర్లు.
TGPSCని వాల్యుయేషన్ వివరాలు అడిగిన హైకోర్టు.
తెలుగులో రాసిన అభ్యర్థులకు ఎలా మార్కులు వేశారన్న హైకోర్టు.
తెలుగులో రాస్తే తక్కువ మార్కులేశారన్న ఆందోళన ఉందన్న హైకోర్టు.
జవాబులకు ఏదైనా 'కీ' ఉంటుందా అని ప్రశ్నించిన హైకోర్టు.
-
2025-04-30T16:11:40+05:30
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
సిల్చార్- షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
అసోం- మేఘాలయా మధ్య కొత్త హైవేకు అనుమతి
చెరకు రైతులకు కనీస మద్దతు ధర పెంపు
-
2025-04-30T14:52:59+05:30
10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి జిల్లాల వారీ వివరాలు..
-
2025-04-30T14:27:00+05:30
పదో తరగతి ఫలితాలు విడుదల
రవీంద్రభారతిలో ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పరీక్షా ఫలితాల కోసం కింద ఉన్న లింకులపై క్లిక్ చేయండి..
-
2025-04-30T13:36:51+05:30
భద్రత పటిష్టం..
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మరింత బలోపేతం
బోర్డును పునర్‌వ్యవస్థీకరించిన కేంద్రం
ఏడుగురు సభ్యులతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు
బోర్డు చైర్మన్‌గా RAW మాజీ చీఫ్ అలోక్ జోషి నియామకం
సభ్యులుగా మాజీ మిలిటరీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు
బోర్డు సభ్యులుగా పి.ఎం.సిన్హా, ఎ.కె. సింగ్, మోంటీ ఖన్నా
సభ్యులుగా మాజీ ఐపీఎస్‌లు రాజీవ్ రంజన్, మన్మోహన్‌సింగ్
బోర్డు సభ్యుడిగా మాజీ ఐఎఫ్ఎస్ బి.వెంకటేష్ వర్మ
-
2025-04-30T13:35:52+05:30
ముగిసిన కేబినెట్ భేటీ
ఢిల్లీ: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 3గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడి
-
2025-04-30T13:06:14+05:30
మరికొద్దిసేపట్లో టెన్త్ పరీక్షా ఫలితాలు.. ఇక్కడ చెక్ చేసుకోండి..
మరికొద్దిసేపట్లో విడుదల కానున్న తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలు
బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తొలుత మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం
అయితే 2:15 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారులు వెల్లడి
పరీక్షా ఫలితాల కోసం కింద ఉన్న లింకులపై క్లిక్ చేయండి..
-
2025-04-30T12:29:16+05:30
మోదీ సర్కార్ కీలక నిర్ణయం..
రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో కేంద్రం కీలక నిర్ణయం
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
-
2025-04-30T11:39:31+05:30
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన ఆదేశం..
గ్రూప్1 పరీక్షపై అప్పీల్ పిటిషన్‌పై టీఎస్ హైకోర్టులో విచారణ
సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసిన TGPSC
గ్రూప్1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే స్టే విధించిన సింగిల్ బెంచ్
విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశం
సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశం
వేసవి సెలవుల ముందే గ్రూప్1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
-
2025-04-30T11:31:38+05:30
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
సమీక్షకు హాజరైన డీజీపీ, ఉన్నతాధికారులు
ఘటన జరిగిన తీరు, వైద్య సాయంపై సీఎంకు వివరణ
విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు
కమిటీ సభ్యులుగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు
72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశం
-
2025-04-30T10:49:33+05:30
మృతులు వీరే..
విశాఖ: సింహాచలం ప్రమాదంలో ఏడుగురు మృతి
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు
మృతులు స్వామి నాయుడు(32), ఎడ్ల వెంకట్రావు(48)
మృతులు మణికంఠ ఈశ్వరరావు(28), పిల్ల మహేష్(30)
మృతులు మహాలక్ష్మి(65), వెంకటరత్నం(45), శైలజ(29)
మృతులు విశాఖ, తూ.గో. జిల్లాల వాసులుగా గుర్తింపు
-
2025-04-30T10:48:15+05:30
హైటెన్షన్..
భారత్-పాక్ సరిహద్దుల్లో కొనసాగుతోన్న హైటెన్షన్
నియంత్రణ రేఖ దగ్గర మరోసారి పాక్ కవ్వింపు చర్యలు
రెచ్చగొట్టే ధోరణితో కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీ
పరగ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పాక్ కాల్పులు
పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత ఆర్మీ
-
2025-04-30T10:47:01+05:30
స్పందించిన కేంద్రమంత్రి
ఢిల్లీ: ప్రతిపక్షాల లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి మేఘ్వాల్
పహల్గామ్ ఘటనపై పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని లేఖ
కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్ వీటిపై చర్చిస్తోంది: మేఘ్వాల్
-
2025-04-30T10:46:15+05:30
ట్రంప్ టారిఫ్ యుద్ధం.. స్పందించిన చైనా..
ట్రంప్ టారిఫ్ యుద్ధంపై స్పందించిన చైనా
ట్రంప్ వాణిజ్య సుంకాల విధానాలకు ఎప్పటికీ మోకరిల్లం: చైనా విదేశాంగశాఖ
రాజీపడటంతో దయ లభించదని చరిత్ర నిరూపించింది: చైనా విదేశాంగశాఖ
మోకరిల్లడం వల్ల బెదిరింపులు మరింత పెరుగుతాయి: చైనా విదేశాంగశాఖ
చైనా ఎప్పటికీ మోకరిల్లదు: చైనా విదేశాంగశాఖ
-
2025-04-30T09:00:45+05:30
ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..
సింహాచలం మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పన పరిహారం
బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం
ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశం
-
2025-04-30T09:00:11+05:30
సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు
ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు వైద్య సహాయంపై ఆరా
-
2025-04-30T08:59:38+05:30
ముంబై నటి జెత్వానీ కేసు..
అమరావతి: ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నికి సీఐడీ నోటీసులు
మే 5న విచారణకు హాజరుకావాలని నోటీసులు
PSR ఆంజనేయులు విచారణలో చెప్పిన అంశాలపై కాంతిరాణా, విశాల్ గున్నిని ప్రశ్నించనున్న సీఐడీ
విశాల్ గున్ని స్టేట్‌మెంట్ నిజం కాదన్న PSR
PSR పిలిస్తేనే వెళ్లానని, జెత్వానీని అరెస్ట్ చేసి తీసుకురావాలని టాస్క్ అప్పగించారని విశాల్ గున్ని స్టేట్‌మెంట్
నిఘా అంశాలు మాత్రమే మాట్లాడి ఉంటానన్న PSR
జెత్వానీ అంశంపై కాంతిరాణాతో కూడా మాట్లాడలేదన్న PSR
PSR స్టేట్‌మెంట్‌తో మరోసారి ఇద్దరిని విచారణకు పిలవాలని సీఐడీ నిర్ణయం
-
2025-04-30T08:57:50+05:30
విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఐరాస సెక్రటరీ జనరల్ ఫోన్
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఐరాస సెక్రటరీ జనరల్ ఫోన్
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్
భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆందోళన
ఘర్షణకు దారితీసే పరిణామాలు నివారించాలని గుటెరస్ సూచన
ఉద్రిక్తతలు తగ్గించేందుకు మద్దతు ఇస్తామన్న ఆంటోనియో గుటెరస్
-
2025-04-30T08:53:05+05:30
విదేశాంగమంత్రికి ఐరాస ఫోన్..
ఐరాస సెక్రటరీ జనరల్ ఫోన్ చేశారు: విదేశాంగమంత్రి జైశంకర్
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన గుటెరస్‌కు ధన్యవాదాలు: జైశంకర్
దాడికి పాల్పడినవారిని చట్టం ముందు నిలబెట్టాలని నిర్ణయించాం: జైశంకర్
-
2025-04-30T08:52:21+05:30
ప్రధాని మోదీ పర్యటన..
అమరావతి చేరుకున్న ప్రధాని భద్రతా దళం
ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో SPG పర్యటన
హెలిప్యాడ్, సభా వేదిక మార్గం సహా సభా వేదిక దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలన
భద్రతా ఏర్పాట్లపై SPGకి వివరించిన అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్స్