Share News

Breaking News: పాకిస్థాన్‌ అత్యవసర సమావేశం..

ABN , First Publish Date - Apr 24 , 2025 | 11:12 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: పాకిస్థాన్‌ అత్యవసర సమావేశం..

Live News & Update

  • 2025-04-24T17:29:37+05:30

    మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు రిమాండ్..

    • గుంటూరు: గోరంట్ల మాధవ్‌కు మరో 14 రోజుల రిమాండ్‌

    • మాధవ్‌ సహా మరో ఐదుగురికి మే 7 వరకు రిమాండ్‌

    • నిందితులను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు

    • రెండు రోజుల పోలీస్‌ కస్టడీ విచారణ అనంతరం..

    • నిందితులకు 14 రోజుల రిమాండ్‌ పొడిగించిన న్యాయస్థానం

  • 2025-04-24T17:29:36+05:30

    ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

    • రేపు మ.12 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • రేపు సా.4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్న చంద్రబాబు

    • అమరావతి పునర్‌నిర్మాణ పనుల శంకుస్థాపనకు..

    • ప్రధాని మోదీని ఆహ్వానించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన

    • రూ.లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

  • 2025-04-24T16:15:58+05:30

    కుదేలవుతున్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ..

    • పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ వెబ్‌సైట్‌ మూసివేత

    • 2 శాతం పైగా పడిపోయిన పాక్‌ స్టాక్‌ మార్కెట్లు

    • భారత్‌ చర్యలతో కుదేలవుతున్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ

  • 2025-04-24T15:30:15+05:30

    పాకిస్థాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ అత్యవసర సమావేశం

    • ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో పాక్‌ NSC భేటీ

    • భారత్‌ చర్యలపై దృష్టి సారించిన పాకిస్థాన్‌ NSC

    • మరోవైపు ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

    • సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించిన జమ్ము ప్రభుత్వం

  • 2025-04-24T15:28:29+05:30

    విశాఖకు డిప్యూటీ సీఎం పవన్..

    • విశాఖకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్‌

  • 2025-04-24T15:27:39+05:30

    ఆస్పత్రికి తరలింపు..

    • ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో A8 చాణక్యను ఆస్పత్రికి తరలింపు

    • వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్న సిట్‌

    • నిన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చాణక్యను అదుపులోకి తీసుకున్న సిట్‌

  • 2025-04-24T15:26:43+05:30

    విజయవాడకు విడదల రజనీ మరిది గోపి..

    • హైదరాబాద్‌ నుంచి విజయవాడకు విడదల రజనీ మరిది గోపి

    • గోపిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు

    • విచారణ అనంతరం గోపిని కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ

    • బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసిన కేసులో విడదల నిందితుడు అరెస్టు

  • 2025-04-24T15:24:50+05:30

    కావలికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

    • నెల్లూరు: కావలికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్‌

    • అనంతరం మధుసూదన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన ధైర్యం చెప్పిన పవన్‌

    • ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ హామీ

  • 2025-04-24T13:05:51+05:30

    దాడి పర్యాటకులపై కాదు.. భారత్‌పైనే: ప్రధాని మోదీ ఆగ్రహం..

    • పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

    • ఉగ్రదాడి మృతులకు యావత్ దేశం అండగా ఉంది: మోదీ

    • అమాయకులను అన్యాయంగా బలితీసుకున్నారు: మోదీ

    • ఈ దాడి పర్యాటకులపై కాదు.. భారత్‌పై చేసింది: మోదీ

    • ఉగ్రదాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: మోదీ

    • ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంది: ప్రధాని మోదీ

    • ప్రతీ ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేస్తాం: ప్రధాని మోదీ

  • 2025-04-24T13:04:12+05:30

    బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన..

    • మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ

    • పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని

    • అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రైలు ప్రారంభం

    • పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన మోదీ

  • 2025-04-24T12:12:31+05:30

    బిహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

    • మధుబనిలలో నేడు పర్యటించనున్న మోదీ

    • రూ.13,480 కోట్ల అభివృద్ధి పథకాలు ప్రారంభించి..

    • జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

    • జాతీయ పంచాయతీ అవార్డులు అందజేయనున్న మోదీ

  • 2025-04-24T12:11:29+05:30

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

    • వాఘా వేడుక, అట్టారి బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం రద్దు

    • అట్టారి దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ మూసివేత

  • 2025-04-24T11:55:55+05:30

    సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ..

    ఉగ్రదాడిని ఖండిస్తూ సాయంత్రం సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ

    పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ

    పాల్గొననున్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు

  • 2025-04-24T11:15:00+05:30

    భారీ ఎన్‌కౌంటర్

    • ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్

    • ముగ్గురు మావోయిస్టులు మృతి

    • ధర్మతాళ్లగూడెం అటవీప్రాంతంలో కాల్పులు

  • 2025-04-24T11:14:15+05:30

    కాలు దువ్వుతున్న పాకిస్థాన్..

    • క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్

    • కరాచీ తీరంలో నేడు, రేపు క్షిపణి పరీక్షలకు పాక్ ఆదేశాలు

    • పాక్ చర్యలను నిశితంగా గమనిస్తున్న భారత రక్షణ వర్గాలు

  • 2025-04-24T11:13:33+05:30

    ఏఐసీసీ అత్యవసర భేటీ..

    • ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం

    • పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అత్యవసర భేటీ

    • పాల్గొన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, సీడబ్ల్యూసీ సభ్యులు

    • ఉగ్రదాడిలో మృతిచెందినవారికి నివాళులర్పించిన సీడబ్ల్యూసీ

  • 2025-04-24T11:12:38+05:30

    భీకర కాల్పులు.. జవాన్ మృతి..

    • జమ్మూకశ్మీర్‌: ఉదంపూర్‌ జిల్లా ఎన్‌కౌంటర్, జవాన్ మృతి

    • బసంత్‌గఢ్‌లో తీవ్రవాదుల ప్రదేశాన్ని చుట్టుముట్టిన బలగాలు

    • భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు

    • బసంత్‌గఢ్‌కు భారీగా చేరుకుంటున్న అదనపు బలగాలు