Breaking News: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం..
ABN , First Publish Date - May 15 , 2025 | 02:29 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 15, 2025 20:11 IST
కృష్ణా, గోదావరి పుష్కరాలు.. సీఎం రేవంత్ స్పందన..
తొలిసారి భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డి
త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయి: రేవంత్‌రెడ్డి
గోదావరి, కృష్ణ పుష్కరాలు ఘనంగా నిర్వహించే భాగ్యం నాకు కలగనుంది: సీఎం రేవంత్‌రెడ్డి
కాళేశ్వరం క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
-
May 15, 2025 20:10 IST
సీఎం చంద్రబాబు పర్యటన.. ఎక్కడంటే..
ఈ నెల 17న కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
సి క్యాంప్ బజార్‌లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో సీఎం ముఖాముఖి
కేంద్రీయ విశ్వవిద్యాలయం దగ్గర స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్క్‌కు శంకుస్థాపన
కర్నూలు ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
-
May 15, 2025 19:33 IST
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం..
నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్‌కు అనుమతి ఇచ్చిన నూజివీడు కోర్టు
ఈనెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరుపర్చాలని ఆదేశాలు
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ వచ్చినా విడుదల కాని వల్లభనేని వంశీ
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
రేపు వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
-
May 15, 2025 18:33 IST
పోలీసుల అదుపులో సినీ హీరో..
జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్
రెండ్రోజుల కిందట ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా వ్యవహరించిన సినీ హీరో
రాంగ్ రూట్‌లో వెళ్లి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన బెల్లకొండ శ్రీనివాస్
ఘటనపై ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
తాజాగా యువ హీరోని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
-
May 15, 2025 18:03 IST
కాళేశ్వరం త్రివేణీ సంగమంలో సీఎం రేవంత్‌రెడ్డి
సరస్వతి నదీ పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్‌రెడ్డి
17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ
-
May 15, 2025 17:59 IST
పోచంపల్లికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
యాదాద్రి : పోచంపల్లికి చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
పోచంపల్లి టూరిజం విలేజ్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
మేళ తాళాలు, కళాకారుల ఆటపాటలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు ఘనస్వాగతం
నేతన్నలతో చీరలు నేచే విధానాన్ని అడిగి తెలుసుకున్న సుందరీమణులు
ఆకట్టుకున్న పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్స్ ప్రత్యేక వీడియో
-
May 15, 2025 17:59 IST
ఈడీ పిటిషన్..
విజయవాడ ACB కోర్టులో ఈడీ పిటిషన్
లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం రికార్డుకు అనుమతించాలని ఈడీ పిటిషన్
లిక్కర్ కేసులో A-1 నిందితుడు రాజ్ కసిరెడ్డి
-
May 15, 2025 17:59 IST
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
సచివాలయంలో ముగ్గురు సీఎండీలతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష
వ్యవసాయ కనెక్షన్లు, కరెంట్ కోతలు, సూర్యఘర్ పనుల పురోగతి పై సమీక్షించిన మంత్రి గొట్టిపాటి
పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి
పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి
క్షేత్ర స్థాయిలో సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని సీఎండీలకు ఆదేశం
కరెంట్ కోతలపై యాప్ ద్వారా వినియోగదారులకు ముందస్తు సమాచారం
-
May 15, 2025 17:57 IST
ముగిసిన విచారణ..
విజయవాడ: ముగిసిన సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణ
తొలిరోజు కస్టడీకి తీసుకుని శ్రీధర్‌రెడ్డిని ప్రశ్నించిన సిట్
లిక్కర్ పాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులు, విక్రయాలపై ప్రశ్నించిన సిట్ అధికారులు
రాజ్ కసిరెడ్డి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాను పనిచేశానని చెప్పిన సజ్జల శ్రీధర్ రెడ్డి
రేపు, ఎల్లుండి కూడా కొనసాగనున్న విచారణ
విజయవాడ జిల్లా జైలులో శ్రీధర్ రెడ్డిని అప్పగించిన సిట్ అధికారులు
-
May 15, 2025 17:56 IST
ప్రైజ్ మనీ ఇదే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ
విజేతగా నిలిచే జట్టుకు రూ.30.78 కోట్ల ప్రైజ్ మనీ
రన్నర్ అప్‌గా నిలిచే జట్టుకు రూ.18.46 కోట్లు
ఆస్ట్రేలియా - సౌత్ ఆఫ్రికా మధ్య WTC ఫైనల్
జూన్ 11 నుంచి ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికగా WTC ఫైనల్
-
May 15, 2025 17:50 IST
మళ్లీ కరోనా భయం..
హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కరోనా భయం
కరోనాతో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తి
హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు సోకిన వైరస్
ఈనెల 3న తొలికేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు
సింగపూర్‌లో వారంలో 14,200కు పెరిగిన కేసులు
సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్ తప్పనిసరి
వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై WHO ఆరా
-
May 15, 2025 17:50 IST
వర్షాలే.. వర్షాలు..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వానలు
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణలో 18 జిల్లాలకు రేపు ఆరెంజ్ ఆలర్ట్
గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
రేపు తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
May 15, 2025 17:18 IST
మరోసారి మెట్రో మోత..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
టికెట్ ధరలు పెంచిన హైదరాబాద్ మెట్రో యాజమాన్యం
మెట్రో కనిష్ట ధర రూ.12, గరిష్ట ధర రూ.75
ప్రస్తుతం కనిష్ట ధర రూ.10 గరిష్ట ధర రూ.60
ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు
-
May 15, 2025 17:01 IST
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
హైదరాబాద్‌కు చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
ముంబై, హైదరాబాద్‌తో పాటు 12 చోట్ల ఈడీ సోదాలు
9 కోట్ల రూపాయల పైచిలుకు నగదుపాటు 8 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం
వైయస్ రెడ్డి ఇంటిలో 23 కోట్ల రూపాయల విలువచేసే నగలు నగదు స్వాధీనం..
ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న వైఎస్ రెడ్డి
41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలపై ఈడి కేసు నమోదు
బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తింపు..
-
May 15, 2025 17:00 IST
కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి..
కాసేపట్లో పుణ్యస్నానాలు ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు
జ్ఞాన సరస్వతి పుష్కరఘాట్ దగ్గర పుణ్య స్నానాలు
17 అడుగుల సరస్వతీ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం
సప్త హారతులను వీక్షించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
-
May 15, 2025 16:33 IST
కాసేపట్లో పోచంపల్లికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
టూరిజం విలేజ్ పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు
పోచంపల్లి సందర్శనకు వస్తున్న ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు
ఇక్కత్ పట్టుచీరల నేతలో ప్రపంచ ఖ్యాతి పొందిన పోచంపల్లి
నేతన్నలతో మాట్లాడనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
పోచంపల్లి వీధుల్లో వాకింగ్, మ్యూజియం సందర్శించనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియో ప్రదర్శన
-
May 15, 2025 16:32 IST
గాయపడిన జవాన్లను పరామర్శించిన అమిత్‌షా
ఢిల్లీ ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షా
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో గాయపడిన జవాన్లకు ఎయిమ్స్‌లో చికిత్స
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన అమిత్‌షా
-
May 15, 2025 16:31 IST
షెడ్యూల్ విడుదల
ఏపీలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల
టీచర్ల బదిలీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం
బదిలీల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
కొత్త బదిలీ విధానం ప్రకారం ఒకే స్కూల్లో 5 ఏళ్లు పనిచేసిన..
హెడ్మాస్టర్లు, 8 ఏళ్లు పనిచేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి
కనీసం రెండేళ్ల సర్వీసు ఉన్నవారు కూడా..
స్వచ్ఛందంగా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రభుత్వం
-
May 15, 2025 15:52 IST
లాభాల బాట స్టాక్ మార్కెట్..
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
1200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
395 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
-
May 15, 2025 15:51 IST
ఘోర ప్రమాదం..
అమెరికాలో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదం
భారత సంతతికి చెందిన వ్యక్తి సహా ముగ్గురు మృతి
పర్వతారోహణ చేస్తూ విష్ణు ఇరిగిరెడ్డి (48) మృతి
-
May 15, 2025 15:29 IST
నకిలీ వీసాల ముఠా అరెస్ట్..
హైదరాబాద్: శంషాబాద్‌లో నకిలీ వీసాల ముఠా అరెస్ట్
చదువు లేని కార్మికులను నకిలీ వీసాలతో విదేశాలకు పంపుతున్న ముఠా
ఇద్దరి వ్యక్తులను నకిలీ వీసాలతో విదేశాలకు పంపేందుకు సిద్ధమైన నిందితులు
కార్మికులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పట్టుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు
ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఎస్వోటీ పోలీసులు
నిందితులు వద్ద నుంచి ఏడు మెుబైల్ ఫోన్లు, 14 నకిలీ వీసాలకు చెందిన పత్రాలను సీజ్ చేసిన పోలీసులు
-
May 15, 2025 15:01 IST
పాలకుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు
దేవరుప్పులలో మండల కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం
దేవరుప్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాశ్, తోటకురి రమేశ్‌ని సమావేశానికి రాకుండా అరెస్ట్ చేసిన పోలీసులు
సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనీ బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దికృష్ణమూర్తి అనుచరులు
-
May 15, 2025 14:31 IST
నెల్లూరు: అమృత్ పైలాన్ ధ్వంసం కేసు
పోలీస్ కస్టడీకి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులు
అప్రూవర్‌గా మారిన రామిరెడ్డి అనుచరుడు సుకుమార్‌రెడ్డి
ఇప్పటికే అరెస్ట్ కాకుండా హైకోర్టులో కండీషన్ బెయిల్ తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
పైలాన్ ధ్వంసం ఘటనతో 35 మందికి సంబంధం ఉన్నట్టు గుర్తింపు
పోలీస్ విచారణలో బయటపడ్డ ఓ రెవెన్యూ అధికారి పాత్ర
అదృశ్యంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు
-
May 15, 2025 14:30 IST
క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
అమరావతి: మీడియా అక్రిడేషన్లపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
మంత్రులు పార్థసారథి, పయ్యావుల, కందుల దుర్గేష్‌తో కమిటీ
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి మీడియా అక్రిడేషన్లపై నివేదిక ఇవ్వనున్న కేబినెట్ సబ్ కమిటీ
-
May 15, 2025 14:29 IST
వంశీకి వైద్య పరీక్షలు పూర్తి..
విజయవాడ: వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య పరీక్షలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వంశీ
కోర్టు ఆదేశాలతో వంశీకి రెండుసార్లు వైద్య పరీక్షలు
వైద్య పరీక్షల అనంతరం జైలుకు వంశీ తరలింపు
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితుడిగా వంశీ