అమరావతిలో రెండో విడత భూ సమీకరణ
ABN , First Publish Date - Dec 02 , 2025 | 07:38 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 02, 2025 20:55 IST
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక ఆహ్వానాలు
సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
సీఎంలను ఆహ్వానించే బాధ్యత మంత్రులకు అప్పగించిన రేవంత్
ఢిల్లీ సీఎం, కేంద్రమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించే బాధ్యత ఎంపీలకు అప్పగింత
జమ్మూ కాశ్మీర్, గుజరాత్ - మంత్రి ఉత్తమ్ కుమార్
పంజాబ్, హర్యానా - మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కర్ణాటక, తమిళనాడు - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఉత్తరప్రదేశ్ - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజస్థాన్ - మంత్రి పొన్నం ప్రభాకర్
ఛత్తీస్‌గఢ్ - మంత్రి కొండా సురేఖ
పశ్చిమబెంగాల్ - మంత్రి సీతక్క
మధ్యప్రదేశ్ - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అసోం - మంత్రి జూపల్లి కృష్ణారావు
బిహార్ - మంత్రి వివేక్ వెంకటస్వామి
ఒడిశా- మంత్రి వాకిటి శ్రీహరి
హిమాచల్‌ప్రదేశ్- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మహారాష్ట్ర - మహమ్మద్ అజరుద్దీన్
-
Dec 02, 2025 20:13 IST
ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ భేటీ
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానికి ఆహ్వానం
రాహుల్, ఖర్గేను ఆహ్వానించనున్న సీఎం రేవంత్
-
Dec 02, 2025 20:01 IST
రావల్పిండి: ఇమ్రాన్‌ఖాన్ మరణ వార్తలకు తెర
జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసిన సోదరి ఉజ్మాఖాన్
ఇమ్రాన్‌ఖాన్‌తో అరగంటకు పైగా సోదరి ఉజ్మాఖాన్ భేటీ
ఇమ్రాన్‌ను పాక్ ప్రభుత్వం మానసికంగా వేధిస్తోంది: ఉజ్మాఖాన్
తనను అంతమొందించేందుకు పాక్ ప్రభుత్వం..
అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇమ్రాన్ మాతో చెప్పారు: ఉజ్మాఖాన్
ఆసిఫ్ మునీర్ తనను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇమ్రాన్ చెప్పారు: ఉజ్మాఖాన్
ఇమ్రాన్‌ఖాన్‌కు ఏం జరిగినా పాక్ ప్రభుత్వం, ISIదే బాధ్యత: ఉజ్మాఖాన్
-
Dec 02, 2025 19:53 IST
హైదరాబాద్: ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లకు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
రూ.27 లక్షల మోసం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
నోట్ల రద్దు వేళ మోసానికి పాల్పడిన పోస్టల్ అసిస్టెంట్లు శ్రీనివాస్, రాజ్యలక్ష్మి
-
Dec 02, 2025 19:52 IST
ఏపీ కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు నిందితులు
A24గా జినేష్, A25గా శిబూను చేర్చిన ఎక్సైజ్ పోలీసులు
-
Dec 02, 2025 19:13 IST
దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మరో కీలక అడుగు
ఈనెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న సదస్సులో..
వివరాలు ప్రకటించనున్న తెలంగాణ ఫిఫా–AIFF ఫుట్‌బాల్ అకాడమీలు
-
Dec 02, 2025 17:16 IST
అమరావతి: విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
వినియోగదారే విద్యుత్ ఉత్పత్తిదారు: సీఎం చంద్రబాబు
ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుదుత్పత్తి
ఫెర్రో అల్లాయ్స్‌కు మరో ఏడాది ప్రోత్సాహకాలు పొడిగింపు
ఎనర్జీ రంగం ఒప్పందాలు 60 రోజుల్లో కార్యరూపం దాల్చాలి
విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో భారాన్ని జీరో చేశాం
ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు: సీఎం చంద్రబాబు
ఏపీలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు: చంద్రబాబు
-
Dec 02, 2025 15:58 IST
బంగాళాఖాతం కొనసాగుతున్న వాయుగుండం
క్రమంగా బలహీనపడనున్న వాయుగుండం
రాబోయే 12 గంటల్లో తీవ్రత తగ్గే అవకాశం
రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం
-
Dec 02, 2025 15:56 IST
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజ్‌భవన్ పేరు లోక్ భవన్‌గా మార్పు
PMO పేరు సేవా తీర్థ్‌గా నామకరణం
-
Dec 02, 2025 14:58 IST
కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
కోటిమంది మహిళలకు చీరలు అందించడమే లక్ష్యం: సీఎం రేవంత్
చీరలు అందలేదని ఫిర్యాదులు వస్తే డీసీసీలదే బాధ్యత: సీఎం రేవంత్
డిసెంబర్ ఆఖరుకు మహిళలందరికీ చీరలు అందించాలి: సీఎం రేవంత్
-
Dec 02, 2025 14:58 IST
అమరావతి: విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్..
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు అంశాలపై రివ్యూ
డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
ట్రాన్స్‌మిషన్ నష్టాల తగ్గింపునకు చర్యలు చేపట్టాలి: చంద్రబాబు
సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలుకావాలి: చంద్రబాబు
MoU ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలి
ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు: చంద్రబాబు
గత పాలకులు విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేశారు: సీఎం చంద్రబాబు
-
Dec 02, 2025 14:28 IST
లోక్‌సభ రేపటికి వాయిదా
-
Dec 02, 2025 14:08 IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణ
7 గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణ
భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత
అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో భూ సమీకరణ
వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,018 ఎకరాల సమీకరణ
తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో భూ సమీకరణ
-
Dec 02, 2025 12:24 IST
నంద్యాల: శ్రీశైలం టోల్ గేట్ వద్ద నైన్ ఎమ్ఎమ్ రివాల్వర్ కలకలం
దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రివాల్వర్ గుర్తించిన పోలీసులు
మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి శ్రీశైలం వస్తుండగా టోల్ గేట్ వద్ద రివాల్వర్ తో దొరికిన వ్యక్తి
తాను మధ్యప్రదేశ్ కు చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అంటూ పోలీసులకు చెప్తున్న వ్యక్తి
రివాల్వర్ ను ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని తెలిపిన శ్రీశైలం సీఐ ప్రసాదరావు
-
Dec 02, 2025 10:10 IST
బస్సుకి నిప్పంటించిన క్లీనర్
ప్రకాశం: స్కూల్ బస్సుకి నిప్పంటించిన క్లీనర్.. డ్రైవర్ నబీకి తీవ్ర గాయాలు
డ్రైవర్ నబీ రిపేర్ చేస్తుండగా బస్సుకు నిప్పంటించిన క్లీనర్ గోపాల్
ఇటీవల బస్సు నడిపే అంశంలో ఇరువురు మధ్య వివాదం
మంటల్లో కంభంలోని ఓ స్కూల్ బస్సు దగ్ధం
అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో ఘటన
-
Dec 02, 2025 10:10 IST
హైదరాబాద్: పలు హోటల్స్‌లో ఐటీ అధికారుల సోదాలు
ఇటీవల మెహఫిల్, పిస్తా హౌస్, షా గౌస్‌లో ఐటీ తనిఖీలు
సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్స్ గుర్తించిన ఐటీ శాఖ
హోటళ్ల ఓనర్లతో సంబంధాలు ఉన్నవారిపై ఐటీ ఫోకస్
ఉడ్‌బ్రిడ్జ్ హోటల్ ఓనర్ హర్షద్ అలీఖాన్‌ను నిన్న ప్రశ్నించిన అధికారులు
పిస్తా హౌస్ సహా ఇతర హోటల్స్‌తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ
-
Dec 02, 2025 08:08 IST
బంగాళాఖాతంలో భూకంపం
ఈరోజు ఉదయం 7:26 గంటలకు బంగాళాఖాతంలో భూకంపం
రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం
భూకంపం సంభవించిందని తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ
-
Dec 02, 2025 07:38 IST
తిరుమల: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు ఆన్‌లైన్‌లో భారీగా రిజిస్ట్రేషన్
మొదటి 3 రోజుల దర్శన టోకెన్లను ఆన్‌లన్‌లో లక్కీడిప్ ద్వారా కేటాయింపు
3 రోజులకు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని TTD అంచనా
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 23.50 లక్షల మంది భక్తులు
రేపు మ.2 గంటలకు లక్కీడిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయింపు
-
Dec 02, 2025 07:38 IST
అనిల్ చొక్రా తొలిరోజు కస్టడీ పూర్తి
ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు అనిల్ చొక్రా తొలిరోజు కస్టడీ పూర్తి
షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మనీ లాండరింగ్ చేసిన అనిల్ చొక్రా
నేడు, రేపు కూడా అనిల్ చొక్రాను విచారించనున్న సిట్
కేసులో A49గా ఉన్న అనిల్ చొక్రా
గతంలో అనిల్ చొక్రాపై ఈడీ, EWOలో కూడా పలు కేసులు నమోదు
-
Dec 02, 2025 07:38 IST
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం
నేడు మహేష్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం
హాజరుకానున్న ఇన్‌చార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్, మంత్రులు
కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం
-
Dec 02, 2025 07:38 IST
ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్‌ను కలవనున్న రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మాట్లాడాలని..
ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి