Breaking News: కాళేశ్వరం ఇంజినీర్ శ్రీధర్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి
ABN , First Publish Date - Jun 19 , 2025 | 08:02 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 20, 2025 05:05 IST
పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారు: సీఎం చంద్రబాబు

ఓ వైపు యోగా జరుగుతుంటే.. మరోవైపు రప్పా రప్పా అంటున్నారు: చంద్రబాబు
చంపండి.. నరకండి.. అని ఎవరైనా అంటారా?: చంద్రబాబు
గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా?: చంద్రబాబు
ఇరుకు వీధుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా?: చంద్రబాబు
హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా?: చంద్రబాబు
రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా?: చంద్రబాబు
నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది: చంద్రబాబు
పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారు: చంద్రబాబు
మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది: చంద్రబాబు
రౌడీయిజం చేసేవారిని, చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలేయాలా?: చంద్రబాబు
ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా?: చంద్రబాబు
భవిష్యత్‌ను తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలి: చంద్రబాబు
-
Jun 20, 2025 05:00 IST
నెల్లూరులో గందరగోళంగా ఏఎన్ఎం, సిబ్బంది బదిలీలు
201 మంది ఏఎన్‌ఎంలలో 70 మందికి యూనియన్ లేఖలు
యూనియన్ల పేరుతో ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట
కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్న పలువురు ఏఎన్‌ఎంలు
బదిలీల్లో అడ్డగోలు వ్యవహారంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ సీరియస్
యూనియన్ లేఖలను తనకు పంపాలని డీఎంహెచ్‌వోకు ఆదేశం
కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన డీఎంహెచ్‌వో
హడావుడిగా కౌన్సెలింగ్ నిర్వహణ, ఆందోళన చేపట్టిన ఏఎన్‌ఎంలు
-
Jun 20, 2025 04:55 IST
ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి అనుమతులు కోరిన రేవంత్
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, మల్లురవి
-
Jun 20, 2025 04:50 IST
ఈనెల(జూన్) 23న కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సభ
సుపరిపాలన-తొలి అడుగు పేరుతో వార్షికోత్సవం సభ
23వ తేదీన ఏపీ సచివాలయం వెనుక సాయంత్రం 5గంటలకు సభ
ఈనెల 12వ తేదీన జరగాల్సిన సభ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా
-
Jun 20, 2025 04:45 IST
నెల్లూరు రైల్వేకోర్టులో మాజీ మంత్రి కాకాణిని హాజరుపరిచిన పోలీసులు

కోర్టులో కొనసాగుతున్న వాదనలు.
అనధికారిక టోల్‌గేట్ కేసులో A1 నిందితుడిగా కాకాణి.
ఇప్పటికే మూడు కేసుల్లో నిందితుడిగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో కాకాణి.
రైల్వే కోర్టులో విచారణ అనంతరం కాకాణిని సెంట్రల్ జైలుకి తరలించనున్న పోలీసులు.
-
Jun 20, 2025 04:30 IST
విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి నారాయణ వరుస సమీక్షలు

యోగాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మందికి అవసరమైన రవాణా ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమావేశం
రవాణా కమిటీ సభ్యులతో ఏయూ కన్వెన్షన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్సలో సమావేశమైన మంత్రి నారాయణ
బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారికీ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ
పార్కింగ్, ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి నారాయణ
-
Jun 20, 2025 04:00 IST
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

మార్కెఫెడ్ ద్వారా కూటమి ప్రభుత్వం నల్ల బార్లీ పొగాకు కొనుగోలు చేయించడం చరిత్ర: మంత్రి అచ్చెన్నాయుడు
నాణ్యమైన పొగాకు క్వింటాకు రూ. 12,000, నాణ్యత తక్కువ పొగాకు రూ. 6 వేల ధర కల్పించాం: మంత్రి అచ్చెన్నాయుడు
పొగాకు రైతుల వద్దనున్న చివరి పొగాకు వరకు కొనుగోలు చేయిస్తాం : మంత్రి అచ్చెన్నాయుడు
గత వైసీపీ పాలకులు ఆర్థికంగా ఏపీని చిన్నాభిన్నం చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఏన్నో ఇబ్బందులు పడ్డాం: అచ్చెన్నాయుడు
ఐదేళ్ల పాలనలో జగన్ ఏ ఒక్క రైతుకీ మేలు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు
జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాలేదు.: అచ్చెన్నాయుడు
నేడు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు రౌడీషీటర్లను పరామర్శలు చేస్తున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
సీఎం చంద్రబాబు పిలుపిస్తే జగన్ పార్టీ కనపడదు: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు
జగన్ మళ్లీ గ్రామాలకు వెళ్లవచ్చు ముద్దులు పెట్టొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు
గత వైసీపీ ప్రభుత్వంలో ధ్యానం కొనుగొలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వలేదు: మంత్రి అచ్చెన్నాయుడు
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మన ప్రభుత్వం తీర్చింది: మంత్రి అచ్చెన్నాయుడు
రైతులను సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు : మంత్రి అచ్చెన్నాయుడు
-
Jun 20, 2025 03:45 IST
విశాఖపట్నం సముద్ర తీరంలో ఈనెల (జూన్) 20,21 తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు
ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై నిషేధం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
-
Jun 20, 2025 03:30 IST
ప్రధానితో జరిగిన సమావేశం నాకు మంచి ప్రేరణ కలిగించింది:మంత్రి నారా లోకేశ్

ప్రధానితో దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశం నా జీవితంలో మర్చిపోలేనిది: మంత్రి నారా లోకేశ్
ప్రతి మనిషి జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి: లోకేశ్
మనం మంచి హృదయంతో పని చేస్తే ప్రజలు వాటిని అర్థం చేసుకుంటారని ప్రధాని నాకు చెప్పారు: లోకేశ్
చేసే పనిలో ఉద్దేశం మంచిదైతే ప్రజలు గుర్తుంచుకుంటారు: లోకేశ్
సంక్షేమ పథకాలు అమలుపరచడం ముఖ్యం కాదు ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా వాటిని అమలుపరచడమే ముఖ్యం: మంత్రి నారా లోకేశ్
మాకు ప్రజలు అధికారం ఇచ్చింది జగన్, ప్రతిపక్ష నేతలపైన కక్ష సాధింపులకు పాల్పడటానికి కాదు: లోకేశ్
తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు: లోకేశ్
జగన్‌పై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోంది: లోకేశ్
రెండు రోజులపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశాను: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కి మంచి చేయాలన్న తపన వాళ్లందరిలో కనిపించింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇచ్చారు : మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలో విద్యారంగంలో చేపట్టబోయే సంస్కరణల గురించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాలా ఆసక్తి చూపించారు: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో కలిసి మరోసారి సమావేశం నిర్వహిస్తాం: మంత్రి నారా లోకేశ్
నైపుణ్యంతో కూడిన విద్యను ఏపీలో అందించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కి సంబంధించిన సంస్థతో చర్చలు జరిపాం: లోకేశ్
ఎమ్మెల్యేల పనితీరుపైన నివేదిక తయారు చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వాళ్ల పనితీరుకు సంబంధించిన నివేదికను వాళ్లకు అందజేస్తాం: లోకేశ్
కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం వారికి మూడు నెలల సమయం ఇస్తాం: మంత్రి నారా లోకేశ్
-
Jun 20, 2025 03:15 IST
ఢిల్లీలో మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్
జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారు: మంత్రి నారా లోకేశ్
చట్ట ప్రకారం అందరికీ శిక్ష పడేలా చేస్తాం: లోకేష్
మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవు: లోకేశ్
ప్రజలు సుపరిపాలన కోసం మాకు అధికారం ఇచ్చారు... వ్యక్తిగత కక్షసాధింపుల కోసం కాదు: లోకేశ్
తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్‌లో ఉన్నాయి: లోకేశ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీని నా కుటుంబసభ్యులతో కలవడం మరిచిపోలేని అనుభవం: లోకేశ్
క్రమశిక్షణతో ఉండాలని, ప్రకృతిని ప్రేమించాలని దేవాన్ష్‌కి ప్రధాని మోదీ చెప్పారు: లోకేశ్
రాజకీయాల్లో ఎలా ఎదగాలి, కార్యకర్తలతో ఎలా మెలగాలి అన్న విషయాలు మోదీ చాలా చక్కగా వివరించారు: లోకేశ్
ప్రధాని మోదీ సలహాలు, సూచనలను ఎప్పుడూ పాటిస్తాను : లోకేశ్
-
Jun 20, 2025 02:45 IST
బనకచర్లపై మా అభ్యంతరాలను కేంద్రమంత్రికి వివరించాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు: మంత్రి ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్ట్ విభజన చట్టానికి వ్యతిరేకం: ఉత్తమ్
బనకచర్లపై పూర్తి డీపీఆర్ రాలేదని కేంద్రమంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్
త్వరలో 2రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు: ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాల్లో 1,500 టీఎంసీలకు ఏపీ ఎన్‌వోసీ ఇవ్వాలి: ఉత్తమ్
ఎన్‌వోసీకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాలి: మంత్రి ఉత్తమ్
అప్పుడే బనకచర్లపై ఏపీతో చర్చలు జరుపుతాం: మంత్రి ఉత్తమ్
తెలంగాణకు అన్యాయం చేయబోమని హామీ ఇచ్చారు: ఉత్తమ్
కేంద్రం న్యాయం చేయకపోతే సుప్రీంకు వెళ్తాం: మంత్రి ఉత్తమ్
ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయి: ఉత్తమ్
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వేగం కనిపించడం లేదు: ఉత్తమ్
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరాం: ఉత్తమ్
ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింకుతో పెన్నా బేసిన్‌కు నీరు తీసుకెళ్లొచ్చు: ఉత్తమ్
ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింకుపై చర్చకు సిద్ధమని చెప్పాం: ఉత్తమ్
మూసీ పునరుజ్జీవం కోసం నిధులు కేటాయించాలని రేవంత్ కోరారు: ఉత్తమ్
-
Jun 20, 2025 01:55 IST
ఇద్దరిని శవాలుగా మార్చారు: పట్టాభి ఫైర్..
జగన్ శవరాజకీయాల కోసం వచ్చి ఇద్దరిని శవాలుగా మార్చారు: పట్టాభి
జగన్ ఆరోపణలను ఆయన కుటుంబం, వైసీపీ కేడర్ కూడా నమ్మరు: పట్టాభి
జగన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఏపీ రాజకీయాల్లో జగన్ ఒంటరిగా మిగిలిపోతారు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
చంపడం, పరామర్శించడం జగన్‌రెడ్డికి అలవాటు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శిస్తారా?: పట్టాభిరామ్
ఏడాది క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శించడం ఓ నాటకం: పట్టాభిరామ్
జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు, ప్లకార్డులు నేరపూరితంగా ఉన్నాయి: పట్టాభిరామ్
రాజకీయ పార్టీ ముసుగులో ఉన్న అంతర్గత తీవ్రవాద వ్యవస్థ వైసీపీ: పట్టాభి
-
Jun 19, 2025 21:23 IST
కాళేశ్వరం ఇంజినీర్ శ్రీధర్ కస్టడీకి ACB కోర్టు అనుమతి
ఇరిగేషన్ ఇంజినీర్ శ్రీధర్‌కు 5 రోజుల కస్టడీ
రేపటినుంచి నూనె శ్రీధర్‌ను ప్రశ్నించనున్న ACB
ఆదాయానికి మించిన కేసులో శ్రీధర్ అరెస్ట్
-
Jun 19, 2025 17:12 IST
తీవ్రరూపం దాలుస్తున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం
హర్మూజ్ జలసంధిని మూసివేసే యోచనలో ఇరాన్.
ఇరాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు రష్యా విజ్ఞప్తి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన రష్యా, చైనా.
ఇరాన్‌పై దాడిని ఖండించిన పుతిన్, జిన్‌పింగ్.
సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్న రష్యా, చైనా.
-
Jun 19, 2025 12:57 IST
అలాంటి వారిని పరామర్శించడం ఏంటి?: షర్మిల
బెట్టింగ్స్ చేసి ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శించడమేంటి?: షర్మిల
బెట్టింగ్స్‌లో నష్టపోయి చనిపోయినవారికి విగ్రహాలు కట్టడమేంటి?: షర్మిల
జగన్.. బల ప్రదర్శనలు కాదు, ప్రజా సమస్యలపై పోరాడాలి: షర్మిల
పరామర్శల పేరిట జగన్ చేసే యాత్రలకు ఆంక్షలు ఉండవా?: షర్మిల
100 మందికి అనుమతి ఇస్తే వేలమంది ఎలా వచ్చారు?: షర్మిల
ఏపీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది?: షర్మిల
నిన్న జగన్ బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారు: షర్మిల
ఇద్దరు మృతికి ఎవరు బాధ్యులు?: షర్మిల
బలప్రదర్శనలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు?: షర్మిల
ఇద్దరు మృతిపై జగన్ సమాధానం చెప్పాలి: షర్మిల
ఇద్దరు మృతికి బాధ్యులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి: షర్మిల
-
Jun 19, 2025 12:57 IST
కేంద్రమంత్రితో మంత్రి ఉత్తమ్ భేటీ..
ఢిల్లీ: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం
బనకచర్లపై అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే మంత్రి ఉత్తమ్ లేఖ
-
Jun 19, 2025 12:54 IST
మెుత్తం ఏడు కేసులు..
జగన్ పల్నాడు పర్యటనలో విధ్వంసంపై 7 కేసులు నమోదు
బెదిరింపులు, ఇద్దరు మృతి ఘటనలపై కేసులు నమోదు
పోలీసులను బెదిరించిన అంబటి సోదరులపై కేసులు
వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై కేసులు
వైసీపీ కార్యకర్తలు షేక్ బుజ్జి, రవితేజపై కేసులు నమోదు
పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అంటూ షేక్ బుజ్జి ప్లకార్డు
గంగమ్మతల్లి జాతర మాదిరి రప్పా, రప్పా నరికేస్తామంటూ రవితేజ ప్లకార్డు
జగన్ పర్యటనలో ఇద్దరు మృతిపై కేసులు నమోదు
పరామర్శకు వెళ్లి పోలీస్ నిబంధనల అతిక్రమించడంపై కేసులు నమోదు
సెక్షన్ 352, 351 PART 2 రెడ్‌విత్ 3 (5) సెక్షన్ల కింద కేసులు నమోదు
దర్యాప్తు అనంతరం మరికొన్ని సెక్షన్ల నమోదుకు ఉన్నతాధికారుల ఆదేశాలు
ఇప్పటికే నిన్నటి ఘటనల్లో నిందితులను గుర్తించిన పోలీసులు
-
Jun 19, 2025 12:16 IST
తప్పుడు కేసులు పెడుతున్నారు: జగన్
ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం ఏంటి? వార్నింగ్స్ ఏంటి?: మాజీ సీఎం జగన్
చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారు: జగన్
భాస్కర్‌రెడ్డి గన్‌మెన్‌తో తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ తీసుకోవాలనుకున్నారు: మాజీ సీఎం జగన్
గన్‌మెన్‌ను చిత్రహింసలకు గురిచేశారు: జగన్
ఆ పోలీస్ గన్‌మెన్ వీడియో తీసి బయటపెట్టారు: జగన్
రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్‌మెన్ లేఖ రాశారు: జగన్
-
Jun 19, 2025 12:16 IST
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
అల్లూరి: ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
మృతదేహాలను చూపించాలంటూ ఆస్పత్రి దగ్గర కుటుంబసభ్యులు డిమాండ్
మావోయిస్టుల కుటుంబ సభ్యులను గేటు దగ్గర అడ్డుకోవడంతో ఆందోళన
-
Jun 19, 2025 12:16 IST
కేంద్రమంత్రితో ముగిసిన భేటీ..
ఢిల్లీ: కేంద్రమంత్రి మాండవీయతో ముగిసిన మంత్రి లోకేష్ భేటీ
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి
అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి
-
Jun 19, 2025 12:16 IST
వాసాలమర్రిని అభివృద్ధి చేస్తాం: పొంగులేటి
కేసీఆర్ దత్తత తీసుకుని ఆగం చేసిన వాసాలమర్రిని అభివృద్ధి చేస్తాం: పొంగులేటి
రూ.22,500 కోట్లతో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఆగస్టు లోపు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
-
Jun 19, 2025 12:12 IST
ఢిల్లీ: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేష్ భేటీ
విద్యారంగంలో AI టూల్స్ వినియోగంపై మంత్రి లోకేష్ చర్చ
నైపుణ్య శిక్షణ, గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై చర్చ
ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై లోకేష్ చర్చ
'టోనీ బ్లెయిర్ ఫౌండేషన్' ద్వారా ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
-
Jun 19, 2025 08:44 IST
హైదరాబాద్: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం గుర్తించిన పైలట్
శంషాబాద్‌కు స్పైస్ జెట్ విమానం తిరుగు పయనం
తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్ రావడంతో ఆందోళన
ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్
-
Jun 19, 2025 08:03 IST
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌తో పాటు ఢిల్లీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు
ఢిల్లీలో రెండు రోజులపాటు సీఎం రేవంత్ బృందం పర్యటన
పలువురు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీకానున్న సీఎం రేవంత్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై చర్చించనున్న రేవంత్
తెలంగాణలో బహిరంగ సభల తేదీలు ఖరారు చేయనున్న రేవంత్
ఉత్తర, దక్షిణ తెలంగాణలో బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్
పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్ బృందం
బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఫిర్యాదు చేయనున్న సీఎం రేవంత్ బృందం
బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రానికి వివరించనున్న రేవంత్
ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో భేటీకానున్న రేవంత్
తెలంగాణకు పెట్టుబడులపై టోనీ బ్లెయిర్‌తో చర్చించనున్న రేవంత్
-
Jun 19, 2025 08:03 IST
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీ మొఘల్‌పురాలో భారీ అగ్నిప్రమాదం
నివాసం భవనం దగ్గర గోదాం గ్రౌండ్‌ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు
మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
భవనంలోని 9 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది
-
Jun 19, 2025 08:02 IST
స్వదేశానికి విద్యార్థులు..
ఇరాన్ నుంచి స్వదేశం రావడం సంతోషంగా ఉంది: భారతీయులు
డ్రోన్లు, క్షిపణుల దాడులతో భయపడ్డాం: భారతీయులు
స్వదేశం తీసుకొచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు: భారతీయులు