Breaking News: ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై బిగ్ అప్‌డేట్..
ABN , First Publish Date - Jun 28 , 2025 | 07:31 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 28, 2025 21:16 IST
అమరావతి: పురపాలక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమృత్ స్కీమ్ కింద తాగునీరు పైప్‌లైన్ పనుల టెండర్లు: చంద్రబాబు
వారంలోగా రూ.5,350 కోట్ల విలువైన పనులకు టెండర్లు: చంద్రబాబు
గుంటూరు, విశాఖ చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు: చంద్రబాబు
నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్లకు టెండర్లు పూర్తి: సీఎం చంద్రబాబు
కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్లాంట్లకు త్వరలో టెండర్లు
మున్సిపాలిటీల్లో ఆధునిక యంత్రాల కొనుగోలుకు రూ.225 కోట్లు
వీలైనంత త్వరగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తాం: చంద్రబాబు
-
Jun 28, 2025 18:46 IST
‘మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై బిగ్ అప్‌డేట్..
అమరావతి: ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు.
ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు.
ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు.
ఇకపై ఆర్టీసీలో ప్రవేశ పెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే.
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
-
Jun 28, 2025 18:40 IST
రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్
మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదు.
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు?
ఈ విషయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలోచించుకోవాలి.
తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు.
కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏం తెచ్చారో చెప్పగలరా?
నేను దాదాపు 35 సార్లు ఢిల్లీ వెళ్లా.
ప్రధాని సహా అనేకమంది కేంద్రమంత్రులను కలిశా.
కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదు.
రేపు అమిత్ షా వస్తున్నారు.. మరోసారి కలిసి విజ్ఞప్తి చేస్తాం.
రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం.
-
Jun 28, 2025 18:00 IST
BRS పాలనలో ఇరిగేషన్‌ను భ్రష్టుపట్టించారు: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్టుల నిర్వహణనూ పట్టించుకోలేదు.
కనీసం పూడికతీత పనులు చేపట్టలేదు.
కాళేశ్వరంలో కమీషన్ల కక్కుర్తితో దండుకున్నారు.
ఇరిగేషన్ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నాం.
జూరాల దిగువన కృష్ణా నదిపై మరో వంతెన.
వంతెన నిర్మాణానికి రూ.100 కోట్లు ప్రకటించిన మంత్రి ఉత్తమ్.
-
Jun 28, 2025 17:40 IST
రా చీఫ్‌గా పరాగ్ జైన్
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) కొత్త చీఫ్‌గా పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (Parag Jain) నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు పదవీకాలంలో కొనసాగుతారు. ప్రస్తుత 'రా' చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో జూలై 1న పరాగ్ జైన్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. -
Jun 28, 2025 17:11 IST
హైదరాబాద్: PJR ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
కొండాపూర్-గచ్చిబౌలి మార్గంలో 6 లేన్లతో 1.2 కి.మీ ఫ్లైఓవర్
రూ.182.72 కోట్ల వ్యయంతో ORR నుంచి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్
గచ్చిబౌలి చౌరస్తా దగ్గర తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
-
Jun 28, 2025 10:51 IST
పీవీకి చంద్రబాబు, లోకేశ్ నివాళి..
పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ప్రముఖుల నివాళులు
104వ జయంతిని పురస్కరించుకుని పీవీకి చంద్రబాబు, లోకేష్ నివాళులు
ఆర్థిక సంస్కరణలతో దేశగతిని మార్చిన పీవీ మనకు స్ఫూర్తి: చంద్రబాబు
బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ.. దేశానికి, రాష్ట్రానికి అనేక సేవలు చేశారు: లోకేష్
తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా కీర్తి గడించారు: లోకేష్
-
Jun 28, 2025 10:51 IST
వడ్డీ వ్యాపారి హత్య..
హనుమకొండ: కాజీపేట రైల్వేక్వార్టర్స్ దగ్గర వడ్డీ వ్యాపారి హత్య
వడ్డీ వ్యాపారి నవీన్‌కుమార్‌ను కొట్టి చంపిన రైల్వేఉద్యోగి ప్రవీణ్‌కుమార్
డబ్బులు ఇస్తానని పిలిచి చంపిన ప్రవీణ్‌కుమార్
రూ.40 వేలు అప్పు విషయంలో మాటామాటా పెరిగి వివాదం
-
Jun 28, 2025 10:51 IST
విజయనగరం ఉగ్రకుట్ర కేసు NIAకు బదిలీ
విజయనగరంలో బాంబు పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్ర
గత నెల 16న ఉగ్రకుట్ర కేసులో సిరాజ్, సమీర్ అరెస్ట్
విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇరువురు
సమగ్ర దర్యాప్తు కోసం కేసు NIAకు బదిలీకి కేంద్రం సన్నాహాలు
-
Jun 28, 2025 10:50 IST
టీవీ యాంకర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
హైదరాబాద్: టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత అజ్ఞాతంలోకి పూర్ణచంద్ర నాయక్
భర్తతో విడిపోయాక పూర్ణచంద్ర నాయక్‌తో ఉంటున్న స్వేచ్ఛ
స్వేచ్ఛ, పూర్ణచంద్ర నాయక్ మధ్య కొంతకాలంగా విభేదాలు
స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు
-
Jun 28, 2025 10:50 IST
GHMC ఆఫీసు ముట్టడి..
హైదరాబాద్: బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
GHMC ఆఫీసు ముట్టడికి BRS యత్నం, అడ్డుకున్న పోలీసులు
GHMC కమిషనర్ గేట్ ముందు ఆందోళన దిగిన కార్పొరేటర్లు
-
Jun 28, 2025 07:35 IST
ప్రజా సమస్యలపై గ్రీవెన్స్..
అమరావతి: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ ఆఫీసులో చంద్రబాబు
గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం
జులై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం
ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించనున్న కూటమి నేతలు
-
Jun 28, 2025 07:33 IST
మరోసారి విదేశాలకు ప్రధాని మోదీ..
జులై 2 నుంచి ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన
బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న మోదీ
ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, నమీబియాలో మోదీ టూర్
-
Jun 28, 2025 07:33 IST
పీవీ జయంతి..
నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి
పీవీ సేవలను కొనియాడిన సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు
-
Jun 28, 2025 07:31 IST
ఘోరం..
వరంగల్: సంగెం మండలం కుంటపల్లిలో దారుణం
కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు
వినోద(50)కు తీవ్రగాయాలు, ఎంజీఎంకు తరలింపు
-
Jun 28, 2025 07:31 IST
బంగాళాఖాతంలో అల్పపీడనం..
బంగాళాఖాతంలో అల్పపీడనంతో పలు ప్రాంతాల్లో వర్షాలు
పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఉమ్మడి హైదరాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు