Share News

Parag Jain: రా చీఫ్‌గా పరాగ్ జైన్

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:06 PM

పంజాబ్ క్యాడర్ 1989 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్‌కు వ్యూహాత్మక ఇంటెలిజెన్స్ వర్క్, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్‌లో విశేషానుభవం ఉంది. ప్రస్తుతం 'రా'లో ఆయన రెండవ మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు.

Parag Jain: రా చీఫ్‌గా పరాగ్ జైన్
Parag Jain

న్యూఢిల్లీ: రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) కొత్త చీఫ్‌గా పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (Parag Jain) నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు పదవీకాలంలో కొనసాగుతారు. ప్రస్తుత 'రా' చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో జూలై 1న పరాగ్ జైన్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. పస్తుతం ఆయన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతిగా సేవలందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)లో జైన్ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ మిలటరీ కదలికలు, ఉగ్ర స్థావరాలు వంటి కీలక ఇంటెలిజెన్స్ సమాచారం సేకరణలో ఆయన సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు.


పరాగ్ జైన్ ఎవరు?

పంజాబ్ క్యాడర్ 1989 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్‌కు వ్యూహాత్మక ఇంటెలిజెన్స్ వర్క్, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్‌లో విశేషానుభవం ఉంది. ప్రస్తుతం 'రా'లో ఆయన రెండవ మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు. 'రా'లో 15 ఏళ్లుగా అంకిత సేవలందిస్తూ.. భారతదేశ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌గా కీలక భూమిక పోషిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహించారు. దీనికి ముందు చండీగఢ్‌లో సీనియర్ సూపరింటెండెంట్‌గా కూడా పని చేశారు.


గ్లోబల్ ఇంటెలిజెన్స్ అనుభవం కూడా జైన్‌కు విశేషంగా ఉంది. కెనడాలోని అట్టావాలో ర్యాడికల్ సిక్కు వేర్పాటువాద నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. శ్రీలంకలోనూ దౌత్య ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.


ఇవి కూడా చదవండి..

మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం

పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్‌ల లాంఛ్ ప్యాడ్స్‌ను నిర్మిస్తున్న దాయాది దేశం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 05:14 PM