Pakistan: పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్‌ల లాంఛ్ ప్యాడ్స్‌ను నిర్మిస్తున్న దాయాది దేశం..
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:47 PM
ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్ తన బుద్ధి మాత్రం మార్చుకోదు. భారత్‌పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు వేయడం లేదు.
ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్ (Pakistan) తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్‌పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు వేయడం లేదు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న టెర్రరిస్ట్ లాంఛ్ ప్యాడ్స్‌ను (Terrorist launchpads) పాకిస్థాన్ మళ్లీ తిరిగి నిర్మిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ప్రతికారం తీర్చుకుంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలు, ట్రైనింగ్ క్యాంపులను బాంబులు, మిసైళ్లతో నాశనం చేసింది. భారత్ దాడి వల్ల పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలు, టెర్రరిస్ట్ లాంఛ్ ప్యాడ్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇంత జరిగినా పాక్ బుద్ధి తెచ్చుకోలేదు. భారత్ దాడిలో దెబ్బతిన్న ఉగ్రస్థావరాలను పాక్ తిరిగి నిర్మిస్తోందని భారత్ నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో ధ్వంసమైన టెర్రరిస్ట్ లాంఛ్‌ప్యాడ్స్, శిక్షణా శిబిరాలను పాక్ పునర్నిర్మిస్తున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కలిసి ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను, పీఓకేలో ఉగ్రవాదుల కోసం మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్టు సమాచారం. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న దట్టమైన అడవుల్లో భారత రాడార్, ఉపగ్రహాలు గుర్తించలేని విధంగా హైటెక్ ఉగ్ర శిబిరాలను పాక్ నిర్మిస్తోందట. ఈ సమాచారంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇవీ చదవండి:
మీ టోల్ ఖర్చులను ఇలా తగ్గించుకోండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి