Gold Smuggling : దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది..
ABN, Publish Date - Mar 11 , 2025 | 08:46 PM
Gold Smuggling : కన్నడ నటి రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ నుండి బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడి వార్తల్లో నిలిచింది. బంగారం అక్రమ రవాణా దుబాయ్ నుంచే ఎందుకు చేస్తారు. అక్కడ గోల్డ్ ధర ఎందుకు తక్కువగా ఉంటుందో మీకు తెలుసా..

భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర చౌకగా లభిస్తుంది. దుబాయ్ వెళితే చాలా మంది ఖచ్చితంగా అక్కడ బంగారం కొంటారు. కొంతమంది నిబంధనలను ఉల్లంఘించి మరీ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటారు.

భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉండటానికి అతిపెద్ద కారణం దిగుమతి సుంకం. మన దేశంలో అధిక దిగుమతి సుంకం కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయి.

భారతదేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసుకుంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంగారం దిగుమతిపై ఎలాంటి సుంకం లేదు. దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుంది కాబట్టి భారతీయులు దుబాయ్‌లో నివసించే తమ పరిచయస్తుల నుంచి లేదా బంధువుల నుంచి బంగారాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకుంటూ ఉంటారు.

దుబాయ్‌లో బంగారం ధర చౌకగా ఉన్నప్పటికీ అక్కడి నుండి భారతదేశానికి బంగారు ఆభరణాలను తీసుకురావడం మాత్రం ఖరీదైనదన వ్యవహారమే.

దుబాయ్‌లో బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా అక్కడి నుండి భారతదేశానికి బంగారాన్ని తీసుకువస్తే కస్టమ్స్ వారికి పన్నులు చెల్లించాల్సి వస్తుంది.

ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రకారం దుబాయ్ నుండి బంగారం కొనడం వల్ల డబ్బు పెద్దగా ఆదా కాదు.

భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీకి దాదాపు 7 శాతం ఛార్జీ ఉంది. కానీ దుబాయ్‌లో మేకింగ్ ఛార్టీలు దాదాపు 25 శాతం ఉంటాయి.
Updated at - Mar 11 , 2025 | 08:47 PM