Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే..

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:24 PM

Holy Celebrations Hyderabad : సంబరాలు అంబారాన్నంటేలా హోలీ వేడుకలు జరిగాయని అంటారు. అయితే, ఇక్కడ నిజంగా హోలీ రంగులు ఆకాశాన్నంటాయి. దక్షిణాదిలో అతిఎత్తైన టవర్‌పై నిర్వహించిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు నింగికి సప్తవర్ణాలద్ది కొత్త అనుభూతిని కలిగించాయి. అదెలాగంటే..

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 1/6

దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన టవర్‌గా ప్రసిద్ధి చెందిన కోకాపేటలో ఉన్న SAS క్రౌన్. 60 అంతస్తులున్న ఈ టవర్‌పై హోలీ వేడుకల సరికొత్త రీతిలో అదిరిపోయేలా నిర్వహించారు.

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 2/6

హైదరాబాద్ స్కై లైన్లో హెలీ సందర్భంగా రంగుల తుఫాన్ చెలరేగింది. SAS Crown వేదికగా "స్కై బ్లాస్ట్" పేరుతో హోలీ వేడుక ఘనంగా జరిగింది.

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 3/6

హోలీ అంటే సాధారణంగా గ్రౌండ్ లెవల్ లో జరుపుకునే పండుగ. కానీ ఈసారి SAS Crown ఈ సంబరాలను ఆకాశంలో జరిపి అందరికీ కొత్త అనుభూతిని అందించింది. టాప్ ఫ్లోర్, స్కై డెక్, ఈవెంట్లో ప్రతి అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 4/6

కేవలం నేల మీదే కాదు. ఆకాశంలోనూ హోలీ జరుపుకోవచ్చు అని నిరూపించిన వేడుక ఇది. SAS Crown పై నిర్వహించిన "స్కై బ్లాస్ట్ హోలీ" మరపురాని అనుభూతిని అందించింది.

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 5/6

నగరంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన SAS Crown ఈసారి ప్రత్యేక హోలీ ఉత్సవాలకు వేదికగా నిలిచింది. 360° స్కై వ్యూ, సిటీ వ్యూ, లగ్జరీ ఫెస్టివల్, ప్రైవేట్ పార్టీ అందరికీ కొత్త అనుభూతిని అందించాయి.

Holy Celebrations : ఆకాశాన్నంటిన స్కై బ్లాస్ట్ హోలీ రంగులు.. ఎక్కడంటే.. 6/6

హోలీ అంటే రంగులు, సంగీతం, ఉత్సాహం. కానీ ఈసారి ఆకాశాన్ని తాకేలా హోలీ సెలబ్రేట్ చేసింది SAS Crown. రంగుల మెరుపులతో హైదరాబాద్ స్కైలైన్ మిలమిల మెరిసిపోయింది.

Updated at - Mar 14 , 2025 | 12:29 PM