Orange Vs Lemon : ఏ సిట్రస్ పండులో విటమిస్ సి ఎక్కువ ఉంటుంది..
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:18 PM
Orange Vs Lemon : విటమిన్ సి ఆరోగ్యానికి చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనిది కీలకపాత్ర. అయితే, విటమిన్ సిలో ఎసిడిటీ గుణాలు అపారంగా ఉంటాయి. ఇది కొంతమందికి సరిపడకపోవచ్చు. మరి, విటమిన్ సి కోసం నారింజ లేదా నిమ్మ ఏది ఎంచుకుంటే మేలు..

శరీరంలో డీ హైడ్రేషన్ తగ్గించి తాజా భావనను కలిగిస్తాయి సిట్రస్ పండ్లు. ఉత్సాహాన్ని నింపే ఈ పండ్లలో ఎసిడిటీ స్వభావం అధికంగా ఉంటుంది. మీరు సి విటమిన్ కోసం నారింజ లేదా లెమన్ ఏది ఎంచుకుంటే మేలంటే..

నిమ్మకాయ పరిమాణంలో తక్కువ ఉంటుంది. నారింజ చూసేందుకు పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి, నారింజలోనే విటమిన్ ఎక్కువ ఉంటుందని భావించడం సహజం. కానీ, నిమ్మకాయ సైజులో చిన్నగా ఉన్నా విటమిన్ సి గాఢత మాత్రం అధికంగానే ఉంటుంది.

100 గ్రాముల నారింజ పండులో దాదాపు 53 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. అయితే, నిమ్మకాయలో 100గ్రాములకు దాదాపు 29 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. (రకాన్ని బట్టి మారవచ్చు)

నారింజ, నిమ్మ రెండూ రోగనిరోధకశక్తిని పెంచేవే. జీర్ణక్రియకు సహాయపడి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటియాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

నారింజ పండులో అధిక పరిమాణం ఉండటం వల్ల విటమిన్ సి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, నిమ్మకాయ రసం నారింజ రసం కంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
Updated at - Mar 06 , 2025 | 06:20 PM