Hair Care Tips : ఈ 5 హోం టిప్స్‌తో.. జుట్టు చివర్లు ఎప్పటికీ చిట్లిపోవు..
ABN, Publish Date - Feb 24 , 2025 | 06:45 PM
జుట్టు మెరిసిపోవాలని ఎక్కువగా షాంపూ చేయడం, కండీషనర్లు, కలరింగ్, స్ట్రెయిట్నింగ్, తలస్నానం చేశాక తడి జుట్టు దువ్వడం తదితర కారణాల వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. ఇందుకోసం రసాయనాలతో తయారుచేసిన కండీషనర్లకు బదులుగా ఇంట్లోనే ఈ 5 చిట్కాలు పాటించండి. జుట్టు చివర్లు చిట్లిపోవడం ఆగిపోవడంతో పాటు ఒత్తైన, అందమైన కురులు మీ సొంతమవుతాయి.

జుట్టు చివర్లు చీలిపోయి జీవం లేనట్లుగా అయిపోవడానికి ఎన్నో రకాల కారణాలున్నాయి. ఈ సమస్యను సులువుగా ఇంట్లోనే ఈ 5 చిట్కాలను పాటించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.

గుడ్లలో చాలా ప్రోటీన్ ఉంటుంది . పెరుగులో లాక్టిక్ ఆమ్లం అధికం. ఇవి జుట్టును లోపలి నుండి పోషకాలు అందించి సంరక్షిస్తాయి. గుడ్డు, పెరుగుతో ప్యాక్ ఇలా చేయండి. ముందుగా 2 గుడ్లు తీసుకొని ఒక గిన్నెలో వేయండి. తర్వాత అందులో పెరుగు కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 15 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అవకాడో, అరటిపండులో మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అవకాడో-అరటి హెయిర్ మాస్క్ తయారీకి ఇలా చేయండి. ముందుగా రెండింటినీ మెత్తగా చేసి, ఆపై వాటిని కలిపి హెయిర్ ప్యాక్ తయారు చేయండి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీటితో కడగాలి.

కొబ్బరి, ఆలివ్ నూనె జుట్టుకు పోషణ, తేమను అందిస్తాయి. కొబ్బరి, ఆలివ్ నూనెలను సమాన పరిమాణంలో కలపి దీన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు ఉంచండి. తర్వాత మీ జుట్టుకు షాంపూ వేయండి.ఇది మీ జుట్టుకు మెరుపును పెంచి చివర్లు చిట్లడాన్ని నివారిస్తుంది.

కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును బలపరుస్తాయి. తేనె జుట్టుకు పోషణనిస్తుంది. అలోవెరా జెల్ లో తేనె కలిపితే హెయిర్ ప్యాక్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి తరువాత షాంపూ చేసుకోండి.

ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇవి జుట్టు చీలిపోవడాన్ని నివారిస్తాయి. ఉల్లిపాయను మిక్సీలో వేసి రుబ్బి రసం తీయండి. తర్వాత దీన్ని తలకు మరియు జుట్టు చివరలకు అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో కడగాలి.ఉల్లిపాయను మిక్సీలో వేసి రుబ్బి రసం తీయండి. తర్వాత దీన్ని తలకు మరియు జుట్టు చివరలకు అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో కడగాలి.
Updated at - Feb 24 , 2025 | 07:07 PM