Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు..

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:54 PM

ఫేస్ వాష్ చేసుకుంటే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి చర్మం శుభ్రపడుతుంది. కానీ, ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఫేస్ వాష్ వాడాల్సిందే అంటారు అమ్మాయిలు. కానీ, మార్కెట్లో దొరికే ఫేస్ వాష్‌లు రసాయనాలతో తయారుచేస్తారు కాబట్టి అందరికీ సరిపడవు. ఇంట్లో అమ్మమ్మలు చెప్పిన చిట్కాలు ఫాలో అయ్యేంత ఓపిక ఉండదు. ఇందుకు పరిష్కారమే ఈ సింపుల్ ఫేస్ వాష్.. ఇంట్లోనే సెకన్లలో చేసుకునే ఈ ఫేస్ వాష్ మీకు ఫేషియల్ చేసుకున్నంత గ్లో ఇస్తుంది.

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 1/7

ఇంట్లో అన్నం రోజు వండటం సహజం. ఆ నీటితో ఫేస్ వాష్ చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా ? ఇది ముఖాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. మరి, బియ్యం నీటితో సహజ ఫేస్ వాష్ తయారీ ఎలాగో తెలుసుకోండి..

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 2/7

బియ్యం నీటిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలను చర్మాన్ని సహజంగా మెరిసిపోవడంతో సాయపడతాయి. ఇందులో ఫెరులిక్ యాసిడ్, అల్లంటోయిన్ ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడతాయి.

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 3/7

బియ్యం నీటితో ఫేస్ వాష్ చేయడానికి, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని ఒక సీసాలో నింపండి.

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 4/7

ఈ నీటిని 12-24 గంటలు పులియబెట్టనివ్వండి. తద్వారా దాని మరింత సమర్థంగా పనిచేస్తుంది. మీరు దీనికి కలబంద జెల్, కొబ్బరి నూనెను కూడా జోడించవచ్చు

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 5/7

ఈ నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం బిగుతుగా మారి మెరుపు వస్తుంది.

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 6/7

ఇది సున్నితమైన చర్మానికి కూడా సురక్షితం, కానీ ఉపయోగించే ముందు అలెర్జీలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.

Beauty Tips : ఈ నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఫేషియల్‌తో పనిలేదు.. 7/7

క్రమం తప్పకుండా బియ్యం నీటితో ఫేస్ వాష్ చేయటం వల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Updated at - Feb 18 , 2025 | 04:58 PM