Vegetable Prices in Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. అల్లం, వెల్లుల్లి ధర ఎంత ఎంతంటే..

ABN, Publish Date - Nov 23 , 2025 | 11:26 AM

ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్‌లో వివిధ రకాల వస్తువులకు సంబంధించిన ధరలను కూడా నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా, పాకిస్తాన్‌లో కూరగాయల ధరలకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Vegetable Prices in Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. అల్లం, వెల్లుల్లి ధర ఎంత ఎంతంటే.. 1/4

ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్‌లో వివిధ రకాల వస్తువులకు సంబంధించిన ధరలను కూడా నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా, పాకిస్తాన్‌లో కూరగాయల ధరలకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో చాలా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక కూరగాయల ధరలైతే కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంతకీ పాకిస్తాన్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Vegetable Prices in Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. అల్లం, వెల్లుల్లి ధర ఎంత ఎంతంటే.. 2/4

పాకిస్తాన్ మార్కెట్లో అల్లం, వెల్లుల్లి ధరలు పేదలు కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. అల్లం కిలో రూ.700, వెల్లుల్లి కిలో రూ.800 ధర పలుకుతోంది. దీంతో చాలా మంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Vegetable Prices in Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. అల్లం, వెల్లుల్లి ధర ఎంత ఎంతంటే.. 3/4

పాకిస్తాన్ మార్కెట్‌‌లో పచ్చిమిర్చి పౌండ్‌ రూ.120, బెల్ పెప్పర్స్ కిలో రూ.400 కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా వంకాయ కిలో రూ.150, ఉల్లిపాయలు కిలో రూ.350 ధర పలుకుతున్నాయి. గతంలో ఉల్లిపాయలు, ఇతర కూరగాయలను ఇండియా నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు చాలా చౌకగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

Vegetable Prices in Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. అల్లం, వెల్లుల్లి ధర ఎంత ఎంతంటే.. 4/4

పాకిస్తా్న్‌లో ప్రస్తుతం కిలో టమాటాలు రూ.600కి అమ్ముడవుతున్నాయి. కేవలం ఒక నెలలోనే 400 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

Updated at - Nov 23 , 2025 | 11:26 AM