Ujjaini Mahankali Bonalu: శాకాంబరీ అలంకరణలో ఉజ్జయిని మహంకాళి..
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:52 PM
Ujjaini Mahankali Bonalu 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి శాకాంబరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి మొదటి బోనం సమర్పించేందుకు జోగిని శ్యామల ఆటపాటలతో దేవాలయానికి తరలివచ్చింది.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఇవాళ శాకాంబరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది.

శాకాంబరీ దేవీ అలంకరణలో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ ఏడాది జులై 13,14 వ తేదీల్లో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఘటాల ఎదుర్కోలుతో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడానికి ఆటపాటలతో దేవాలయానికి తరలి వస్తున్న జోగిని శ్యామల

డప్పు చప్పుళ్ల నడుమ ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనం సమర్పణ
Updated at - Jul 04 , 2025 | 06:12 PM