Milad un Nabi Celebrations in Hyderabad : పాత బస్తీలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ..
ABN, Publish Date - Sep 14 , 2025 | 07:04 PM
హైదరాబాద్‌లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మక్కా మసీద్‌లో జహూర్ ప్రార్థనలు నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ కమిటీ ఆధ్వర్యంలో ఒంటెలు, బైకులు, కార్లు, ఆటోలతో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు.
1/6
హైదరాబాద్‌లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మక్కా మసీద్‌లో జహూర్ ప్రార్థనలు నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ కమిటీ ఆధ్వర్యంలో ఒంటెలు, బైకులు, కార్లు, ఆటోలతో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు.
2/6
అనంతరం అక్కడి నుంచి గుల్జార్ హౌస్, పట్టీర్ ఘట్టీ, మదీనా, నయాపూల్, దారుల్ ఫీషా, పురానీ హవేలీ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మిరాలం మండి, మొగలుపురా వరకు మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ర్యాలీ చేశారు.
3/6
ఈ ర్యాలీలో వేలాది మంది ముస్లింలు, యువకులు పాల్గొన్నారు. ఇక దర్గా జెండాలు పట్టుకుని.. ర్యాలీగా వెళ్తూ హిందూస్థాన్ జిందాబాద్ అంటూ వారంతా బిగ్గరగా నినాదాలు చేశారు.
4/6
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ ర్యాలీకి మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు.
5/6
ఇక ఈ ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆదివారం రాత్రి 8.00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అలాగే ఫలక్‌నుమా, చార్మినార్, మదీనా జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఏంజే మార్కెట్ జంక్షన్, నాంపల్లి టీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ సూచించారు. అదే విధంగా ఈ ఊరేగింపుల్లో పాల్గొనే యువత బైక్ విన్యాసాలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
6/6
అసలు అయితే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం జరగాల్సి ఉంది. కానీ వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఈ ర్యాలీని వాయిదా వేసుకోవాలని మిలాద్ ఉన్ నబీ కమిటీకి పోలీసులు విజ్జప్తి చేశారు. అందుకు సదరు కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ర్యాలీని ఆదివారం అంటే.. సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించారు.
Updated at - Sep 14 , 2025 | 07:04 PM