CM Revanth Reddy : ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ

ABN, Publish Date - May 13 , 2025 | 07:07 AM

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా ఫెసిలిటీ సెంటర్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాభినందనలు తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. రాజీవ్‌ యువవికాసం ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 1/8

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా ఫెసిలిటీ సెంటర్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 2/8

సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాభినందనలు తెలిపారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 3/8

సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 4/8

హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో ఇంకా చాలా రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 5/8

అలాగే ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 6/8

మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 7/8

డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy : ఐటీ రంగంలో  అగ్రస్థానంలో  తెలంగాణ 8/8

ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated at - May 13 , 2025 | 07:19 AM