TG MLC Polls: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
ABN, Publish Date - Feb 26 , 2025 | 04:30 PM
ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 27న ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌ల కోసం క్లోజ్డ్ బాడి వెహికల్స్‌లో అమర్చిన జీపీఎస్ డివైస్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.

ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ విధులు నిర్వహించడానికి కేటాయించిన సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు.

. పోలింగ్ సిబ్బందికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. డిస్ట్రిబ్యూ షన్ సెంటర్‌లో తాగునీటి వసతి, భోజన వసతి కల్పించినట్లు చెప్పారు.

ఎన్నికల సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లు తరలించేందుకు 6 క్లోస్డ్ బాడి వెహికల్స్‌లో జీపీఎస్ డివైస్ అమర్చామని చెప్పారు.
Updated at - Feb 26 , 2025 | 04:33 PM