Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అంబరాన్నంటిన సంబురాలు
ABN, Publish Date - Mar 10 , 2025 | 07:56 AM
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది. భారత్ గెలవడంతో హైదరాబాద్‌లో సంబురాలు అంబరాన్నంటాయి.

భారత్ విశ్వవిజేతగా నిలిచిన వేళ అభిమానుల సంబురాలు చేసుకున్నారు.

సచివాలయం వద్ద జాతీయ జెండా పట్టుకొని, టపాసులు కాలుస్తూ యువత కేరింతలు కొట్టారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి.

జాతీయ జెండాలు పట్టుకొని యువత సందడి చేశారు.

భారత్ మాతాకీ జై అంటూ యువత నినాదాలు చేశారు. దీంతో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

బస్సు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తున్న యువకులు

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల క్రీడాప్రతిభను ప్రశంసిస్తూ క్రీడాకారులకు జేజేలు పలికారు.
Updated at - Mar 10 , 2025 | 07:59 AM