సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ

ABN, Publish Date - Dec 07 , 2025 | 11:28 AM

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ వైజాగ్‌లోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 1/8

విశాఖపట్నం వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మూడో వన్డేలో తలపడిన విషయం తెలిసిందే.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 2/8

మ్యాచ్ కోసం వైజాగ్ వెళ్లిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 3/8

అంతకు ముందు దేవాలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేశారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 4/8

విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్‌లకు స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 5/8

మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించి.. సిరీస్‌ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న విషయం తెలిసిందే.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 6/8

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు సాధించాడు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 7/8

ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ 8/8

వైజాగ్‌లో విరాట్‌కు తన కెరీర్‌లో మంచి రికార్డు ఉంది. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated at - Dec 07 , 2025 | 11:28 AM