International Tennis Tournament: భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్ సిరీస్ ప్రారంభం
ABN, Publish Date - Aug 26 , 2025 | 10:02 AM
యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ స్కూల్‌లో రాజా నర్సింహరావు ITF-J60 ఇంటర్ నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టెన్నిస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
1/14
అంతర్జాతీయ టెన్నిస్ సిరీస్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణం ఆతిథ్యం ఇస్తోంది. స్థానిక న్యూడైమెన్షన్ టెన్సిస్ అకాడమీలో ఐదు రోజుల పాటు జరుగనుంది. రాజా నర్సింహారావు మెమోరియల్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అండర్-18 సిరీస్‌కు భారీ ఏర్పాట్లు చేశారు.
2/14
శని, ఆదివారాల్లో క్వాలిఫై మ్యాచ్‌లు జరిగాయి. ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి.
3/14
ఈ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తదితరులు
4/14
దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు అమెరికా, కెనడా తదితర దేశాలకు చెందిన సుమారు 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
5/14
ఎనిమిది కోర్టుల్లో బాల బాలికలకు వేర్వేరుగా వందకు పైగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీని తొమ్మిది మంది అంపైర్లు, ఒక చీఫ్ రెఫరీ, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రతినిధి జె.శివకుమార్‌రెడ్డి ఈ సిరీస్‌ను పర్యవేక్షించనున్నారు.
6/14
అందుకు కోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు భువనగిరికి చేరుకున్నారు. వారందరూ భువనగిరి, యాదగిరిగుట్టలోని హోటళ్లలో బస చేస్తున్నారు.
7/14
విజేతలకు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ), తెలంగాణ స్టేట్ టెన్సిస్ అసోసియేషన్ (టీఎస్‌టీఏ), యాదాద్రి భువనగిరి జిల్లా టెన్నిస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీ అతిథ్యం ఇస్తోంది.
8/14
టోర్నీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు, టీఎస్టీఏ కార్యదర్శి కేఆర్. రామన, ఉపాధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
9/14
కాగా, ఇదే అకాడమీలో ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు నేషనల్ టెన్నిస్ సిరీస్ జరగ్గా, నాలుగు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ టోర్నీని భువనగిరిలో నిర్వహిస్తుండటం విశేషం.
10/14
ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సిరీస్‌లన్నీ ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకే పరిమితం కాగా, మొట్టమొదటి సారిగా గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు ఏఐటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు.
11/14
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్ అకాడమీలు ఉన్నట్లు టెన్నిస్ ప్రపంచానికి తెలియజేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతోనే భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్ సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు టీఎస్‌టీఏ ఉపాధ్యక్షుడు అశోక్ తెలిపారు.
12/14
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
13/14
క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు
14/14
విలు విద్య పోటీలో క్రీడాకారులు
Updated at - Aug 26 , 2025 | 10:08 AM