Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

ABN, Publish Date - Aug 22 , 2025 | 07:07 PM

హైదరాబాద్ నగరంలోని వివిధ ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కూకట్‌పల్లిలో శ్రావణమాస చివరి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజించారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 1/6

హైదరాబాద్ నగరంలోని వివిధ ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కూకట్‌పల్లిలో శ్రావణమాస చివరి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 2/6

ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజించారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 3/6

ఆలయాల్లో వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవ చేశారు. మూలవిరాట్‌కు పసుపు, కుంకుమలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ విశేష పూజలు నిర్వహించారు. బ్రాహ్మణులు మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 4/6

ముత్తయిదువులు మహాలక్ష్మి విగ్రహానికి ధూప, దీప, నైవేద్యాలతో పూజలు చేసి, వరలక్ష్మి వ్రత కథను ఆలకించి, మహా మంగళ హారతితో కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 సార్లు మహాలక్ష్మి అష్టోత్తర శతనామ కుంకుమార్చన, 108 తామరపుష్పాలతో అర్చనలు వైభవంగా చేశారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 5/6

అనంతరం 16 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం ముత్తయిదువులకు చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు.

Varalakshmi Vratham: కూకట్‌పల్లిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం 6/6

శుక్రవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, తదితర పూజలు చేశారు. భక్తులు బారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated at - Aug 23 , 2025 | 02:11 PM