Mini Medaram Jathara: వన దేవతల పున: దర్శనానికి వేళాయే.. సమ్మక్క - సారక్కల జాతర ఎప్పటినుంచంటే..
ABN, Publish Date - Feb 07 , 2025 | 08:25 AM
Mini Medaram Jathara: సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతరను రెండేళ్లకోసారి మేడారం మహా జాతరగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహాజాతర ముగిసిన ఏడాది తర్వాత మినీ మేడారం జాతరను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తుంటారు. మినీ మేడారం జాతరకు కూడా భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో మినీ మేడారం జాతర నిర్వహించడానికి ఆదివాసి పూజారులు ముహూర్తం ఖరారు చేశారు.

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మినీ మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుని.. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేశారు.

మినీ మేడారం జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

సమ్మక్క-సారలమ్మలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుంది.

మహాజాతర ముగిసిన ఏడాది తర్వాత మినీ మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు భక్తులు మినీ మేడారం జాతరను భక్తి శధ్ధ్రలతో నిర్వహిస్తారు.

భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

భక్తులు స్నానాలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

అమ్మవార్లకు భక్తులు తలనీలాలు సమర్పించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు.

బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలువాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడి నుంచి గుట్టగడ్డిని తెచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు.

అమ్మవార్లకు భక్తులు ఎదుర్కోళ్లు ఇచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు.

జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగే, మండ మెలిగె పండుగను నిర్వహిస్తుంటారు. బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు గుడి మెలిగే పండుగ చేశారు.

సమ్మక్క గారాల బిడ్డ సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా భక్తులు కొలుస్తారు.

12వ శతాబ్దాంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయలతో సారలమ్మ యుద్ధం చేశారు.

సారలమ్మ యుద్ధం చేసిన తీరును, వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు.

తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని, రుగ్మతలు తొలగి పోతాయని భక్తులు విశ్వాసంగా భావిస్తారు.

ఫలితంగా మేడారానికి వెళ్తున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు అమ్మవార్లకు మొక్కుతారు.

మేడారంలోని సమ్మక్క ఆలయంలోని సిద్ధబోయిన వంశస్థులు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాకతీయవంశీయులు గుడిమెలిగే పండుగను ఘనంగా జరుపుతారు. అత్యంత నియమ నిష్టలతో పూజారులు గద్దెలను శుద్ధి చేశారు.

పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలువాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడి నుంచి గుట్టగడ్డిని తెచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు.

మండమెలిగే, గుడిమెలిగే పండుగతో వనదేవతల మినీ జాతర ప్రారంభమైందని పూజారులు తెలిపా రు. మినీ జాతర ముగిసే వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు రాత్రి వేళల్లో డోలీలతో కొలుపు చేస్తారు.
Updated at - Feb 07 , 2025 | 08:50 AM